Friday, November 22, 2024

గెస్ట్ ఫ్యాకల్టీ నియామకానికి మార్గదర్శకాలు.. వారం రోజుల్లో ప్రక్రియ..

హైదరాబాద్‌, (ప్ర‌భ‌న్యూస్): తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించిన గెస్ట్‌ ఫ్యాకల్టిల నియామకాలకు ప్రభుత్వం మార్గదర్శకాలను ఖరారు చేసింది. గెస్ట్‌ ఫ్యాకల్టిల నియామకంకు సంబంధించిన ప్రక్రియను వారం రోజుల్లో పూర్తి చేయాలని ఈమేరకు అదేశాలు జారీ చేశారు. అయితే ఈ గెస్ట్‌ ఫ్యాకల్టిల నియామకం త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో జరగనుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు పీజీలో కనీసం 50 శాతం మార్కులు, మిగతా అభ్యర్థులు 55 శాతం మార్కులు సాధించి ఉండాలి. నెట్‌, సెట్‌తో పాటు పీహెచ్‌డీ పూర్తి చేసి అభ్యర్థులకు మొదట ప్రాధాన్యత కల్పించనున్నారు. నెలకు 72 గంల పాటు పనివేళలు ఉండనున్నాయి.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అతిథి అధ్యాపకులను రెన్యూవల్‌ చేయకపోవడం బాధాకరమని, తెలంగాణ అతిథి అధ్యాపకుల జేఏసీ రాష్ట్ర అధికార ప్రతినిధి దేవేందర్‌ యాదవ్‌ అన్నారు. గతంలో డిగ్రీ కళాశాలల్లో పని చేసిన గెస్ట్‌ లెక్చరర్లను రెన్యూవల్‌ చేసి 719 మంది గెస్ట్‌ కుటుంబాలను రోడ్డున పడకుండా ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి అధికారులు పరిష్కారం దిశగా కృషి చేయాలని ఆయన కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement