కొత్తూరు, జనవరి29(ప్రభ న్యూస్): కొత్తూరు మండల పరిధిలోని గూడూరు గ్రామంలో గల శ్రీ కాశీవిశ్వేశ్వర ఆలయంలో ఆలయంలో దొంగలు తమ చేతి వాటాన్ని ప్రదర్శించారు. ఆదివారం అర్ధరాత్రి దుండగులు ఆలయంలోకి చొరబడి ఆలయంలో గల శివుడి గుడి తలుపులు తెరిచి వెండి వస్తువులు, శివుడి, అమ్మవారి హుండీలను హుండీలతో సహా దుండగులు ఎత్తుకెళ్లారు.
అయితే శివాలయం ప్రారంభోత్సవం నాటి నుండి హుండీలను లెక్కించలేదని త్వరలోనే హుండీ తాళాలను తెరిచి గ్రామస్తుల సమక్షంలోనే లెక్కించాలని ఆలయకమిటి సభ్యులు నిర్ణయించుకున్న సమయంలోనే దొంగలు పడ్డారని సర్పంచ్ బ్యాగరి సత్తయ్య తెలిపారు. శివాలయంలో సోమవారం రోజునే దొంగలు పడటంతో గ్రామస్థులు ఇదేం విడ్డూరం అని చర్చించుకుంటున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.