భద్రాచలం, (ప్రభ న్యూస్) : తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో ఇవ్వాల (సోమవారం) హుండీ ఆదాయం లెక్కింపు చేపట్టారు. కాగా, భక్తుల తాకిడి పెరగడంతో గతం కంటే స్వామివారి ఆదాయం కూడా బాగానే పెరిగిందని అధికారులు తెలిపారు. రూ. 2.0కోట్లు దనరూపంలో, బంగారం 140 గ్రాములు, వెండి 2 కేజీల 500 గ్రాములు, 780 అమెరికన్ డాలర్లు, 300 మలేషియా రింగిట్స్, 150 ఆస్ట్రేలియా డాలర్లు, 100 రష్యా రబుల్స్, 30 యూఏఈ దీరామ్స్, 101 భూటాన్ , సౌదీ 1 రియల్స్ హుండీలో లభించాయని ఇంత పెద్ద ఎత్తున ఆదాయం రావడం సంతోషంగా ఉందని ఆలయ వర్గాలు తెలిపాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement