Monday, January 6, 2025

Group-2 – ఉద్యోగానికి దూరం చేసిన నిమిషం నిబంధన

హైదరాబాదు – గ్రూప్-2 అభ్యర్థుల ను ఒక్క నిమిషం నిబంధన కొంపముంచింది. నిమిషం నిబంధనతో కొందరు అభ్యర్థులు పరీక్షకు దూరమయ్యారు. తెలంగాణలో ఇవాళ గ్రూప్-2 పరీక్షలు ప్రారంభమైన సంగతి తెలిసిందే.

మొదటి రోజు మొదటి పరీక్ష ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. అయితే కొందరు అభ్యర్థులు పరీక్షకు హాజరు కాలేకపోయారు. నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాలులోకి వెళ్లవద్దని అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో అభ్యర్థులు గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. అయితే సకాలంలో పరీక్షా కేంద్రానికి చేరుకోకపోవడంతో కొందరు అభ్యర్థులు పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోయారు.

జిల్లాల వారీగా పరీక్షకు దూరమైన అభ్యర్థులు..

- Advertisement -

*ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఆలస్యంగా రావడంతో 16 మంది అభ్యర్థులు పరీక్షకు దూరమయ్యారు. ఉదయం 9.30 గంటలకే గేట్ క్లోజ్ చేశారు. ఒక్క నిమిషం ఆలస్యం అయినా అనుమతించడంకపోవడంతో అభ్యర్థులు నిరాశతో వెనుదిరిగారు. అనుమతి నిరాకరించడంతో పలువురు కంటతడి పెట్టుకున్నారు.

*కొమురం భీం జిల్లాలో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని పీటీజి గర్ల్స్ హాస్టల్ లో గ్రూప్ 2 పరీక్ష రాయడానికి వచ్చిన అభ్యర్థినీ నిమిషం ఆలస్యం రావడంతో అనుమతించని సిబ్బంది. దీంతో ముగ్గురు అభ్యర్థులు పరీక్షకు దూరమయ్యారు.

*మంచిర్యాల జిల్లాలో శ్రీ హర్ష డిగ్రీ కాలేజ్ పరీక్ష కేంద్రానికి ఒక్క నిమిషం ఆలస్యమైనందుకు ముగ్గురు అభ్యర్థులను లోపలికి అనుమతించకుండా వెనక్కి పంపించిన అధికారులు..

*జనగామ జిల్లాలో ఓ బాలింత మహిళ అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకున్న గ్రూప్ 2 పరీక్ష వ్రాసే అవకాశాన్ని కోల్పోయింది. ఓఎంఆర్ షీటు బయోమెట్రిక్ సమయంలో అభ్యర్థి సెంటర్ మారిందని గుర్తించిన అధికారులు. అప్పటికే అరగంట పాటు అదే సెంటర్ లోనే కూర్చోవడంతో వృధా అయిన సమయం. పరీక్ష కేంద్రంలోకి అనుమతించి నప్పుడు సెంటర్ కోడు చూసి ఇది కాదు అని చెప్పిన అధికారులు. దీంతో వెంటనే పక్కనే ఉన్న అసలు పరీక్ష కేంద్రానికి వెళ్లిన అభ్యర్థిని పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదు. దీంతో చేసేదేమీ లేక పరీక్షా కేంద్రం వద్ద కన్నీరు పెట్టుకుంటూ తన ఆవేదన వ్యక్తం చేసిన బాలింత మహిళ.

.*జనగామ జిల్లా లోని క్రీస్తు జ్యోతి ఇంజనీరింగ్ కళాశాల పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా వచ్చిన ఐదుగురు గ్రూప్ 2 అభ్యర్థులు. నిబంధన మేరకు పరీక్ష కేంద్రంలోకి అనుమతించని అధికారులు. నిరాశతో వెనుతిరిగి వెళ్లిన అభ్యర్థులు.

*వరంగల్ ఏస్ అర్ కాలేజి సెంటర్ లో గ్రూప్ 2 పరీక్షలకు ఆలస్యంగా వచ్చిన ముగ్గురు విద్యార్థులను అధికారులు అనుమతించలేదు. ఆవేదన వ్యక్తం చేస్తున్న అభ్యర్థులు.

*జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాలలో ఏర్పాటు చేసిన గ్రూప్ -2 పరీక్షా కేంద్రానికి 05 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన రాంబాబు అనే అభ్యర్థిని లోనికి అనుమతించని నిర్వాహకులు

.*నాగర్ కర్నూల్ నియోజకవర్గంలోని పరీక్ష కేంద్రాలకు ఆలస్యంగా హాజరైన 19 మంది అభ్యర్థులను అనుమతించని అధికారులు.

*ములుగు జిల్లా గ్రూప్ 2 పరీక్షకు సాధన స్కూల్ వద్దకి ఆలస్యంగా వచ్చిన ఇద్దరు అభ్యర్థులను అధికారులు అనుమతించలేదు. గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామానికి చెందిన భవాని అనే అభ్యర్థిని కాగా, మరొకరు కన్నాయిగూడెం మండలానికి చెందిన అభ్యర్థి. వివరాలు చెప్పకుండా వెంటనే అక్కడ నుంచి వెళ్లిన అభ్యర్థులు.*సంగారెడ్డి లోని గ్రూప్ 2 పరీక్ష కేంద్రానికి 15 మంది అభ్యర్థులు వచ్చారు. లోపలికి అనుమతించని అధికారులు

Advertisement

తాజా వార్తలు

Advertisement