Thursday, December 12, 2024

Group-2 Hall Tickets – ఆన్ లైన్లో గ్రూపు – 2 హాల్ టికెట్స్

హైదరాబాద్ – ఈ నెల 15,16 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో 1368 పరీక్ష కేంద్రాలలో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది.

తాజాగా గ్రూప్‌-2 పరీక్షలకు సంబంధించిన హాల్‌ టికెట్లను టీజీపీఎస్సీ విడుదల చేసింది. నేటి నుంచి ఈ నెల 15వ తేదీ ఉదయం 9 గంటల వరకు కమిషన్ వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని అధికారులు పేర్కొన్నారు.

- Advertisement -

ఇక రోజూ ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి. ఉదయం సెషన్‌లో 8.30 నుంచి 9.30 గంటల వరకు..మధ్యాహ్నం పరీక్షకు 1.30 గంటల నుంచి 2.30 వరకు పరీక్షా కేంద్రంలోకి అనుమతించనున్నారు. తర్వాత వచ్చిన వారికి పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఇవ్వరని అభ్యర్థులకు టీజీపీఎస్సీ సూచనలు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement