Monday, November 18, 2024

Group 1 – ప‌రీక్ష‌లు బాగా రాయండి ….తెలంగాణ పున‌ర్ నిర్మాణంలో భాగ‌స్వాములు కండి: రేవంత్

గ్రూప్ 1 అభ్య‌ర్ధుల‌కు ఆల్ ది బెస్ట్ చెప్పిన రేవంత్
ఎటువంటి ఆందోళ‌న లేకుండా ఎగ్జామ్స్ రాయండి
మీకు శుభాకాంక్ష‌లు అంటూ సిఎం ట్విట్

హైద‌రాబాద్ – గ్రూప్ వ‌న్ మెయిన్స్ ప‌రీక్ష రాస్తున్న అభ్య‌ర్ధుల‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ ఆల్ ద బెస్ట్ చెప్పారు.. ఈ మేర‌కు ఆయ‌న ట్విట్ చేశారు.. ఎటువంటి వ‌త్త‌డి లేకుండా ప్ర‌శాంత చిత్తంతో ఎగ్జామ్స్ రాయాల‌ని సూచించారు.. ప‌రీక్ష‌ల‌లో విజ‌యం సాధించి తెలంగాణ పున‌ర్ నిర్మాణంలో భాగ‌స్వాములు కావాల‌ని అభ్య‌ర్ధుల‌కు పిలుపు ఇచ్చారు. అంద‌రూ కూడా ప‌రీక్ష ఉత్తీర్ణ‌త సాధించాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున‌ట్లు రేవంత్ తెలిపారు..

సుప్రీం తీర్పును స్వాగ‌తిసున్నా …. పిసిసి చీఫ్

సుప్రీంకోర్టు తీర్పు తో విద్యార్థులు హ్యాపీగా పరీక్షలు రాసుకోవాలని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని తెలిపారు. గ్రూప్ 1 పరీక్షలను వాయిదా వేయలేమని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు హర్షనీయమన్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో విద్యార్థులు హ్యాపీ గా పరీక్షలు రాసుకోవాలని సూచించారు. 13 ఏళ్ల తర్వాత ఒక మంచి అవకాశం వచ్చింద‌ని, మంచిగా ఉపయోగించుకొని ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షిస్తున్నా అన్నారు.

- Advertisement -

తాము మొదటి నుంచి గ్రూప్ 1 విద్యార్థులకు అండగా ఉన్నామన్నారు. ఇదే విషయాన్ని పదే పదే చెపుతూనే ఉన్నామని గుర్తు చేశారు. జీఓ 29 వల్ల రిజర్వేషన్లు అభ్యర్థులకు ఎలాంటి అన్యాయం జరగదని మరోసారి చెప్తున్నామని తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు వారి రాజకీయ లబ్ది కోసం గ్రూప్ 1 విద్యార్థులను పావుగా వాడుకున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement