Friday, November 22, 2024

Group 1 – తొలి రోజు .. తొలి ప‌రీక్ష ప్ర‌శాంతం ..

హైద‌రాబాద్ తొలిరోజు గ్రూప్‌-1 మెయిన్స్ తొలి పరీక్ష ముగిసింది. నేటి నుంచి ప్రారంభ‌మైన ఈ ప‌రీక్ష‌లు ఈ నెల 27 వరకు ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. కాగా, పలు చోట్ల పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను పోలీసులు కేంద్రాల్లోకి అనుమతించలేదు. ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా గేట్లు తాళం వేయడంతో అక్కడే ఉన్న సిబ్బందిని అభ్యర్థులు చాలాసేపు వేడుకున్నారు. కానీ నిబంధనల ప్రకారం అనుమతించేది లేదని సిబ్బంది చెప్పారు. దీంతో చాలామంది వెనుతిరిగారు.

ఇక సికింద్రాబాద్‌లోని పరీక్షా కేంద్రానికి ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చిన మాథ్యూస్‌ అనే అభ్యర్థిని పోలీసులు అనుమతించలేదు. దీంతో గోడ దూకి పరీక్ష కేంద్రం వైపు పరుగులుపెట్టాడు. ఇది గమనించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని బేగంపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

- Advertisement -

పోలీసుల సాయం… స‌కాలంలో ప‌రీక్షా కేంద్రానికి

దుండిగల్‌లో ఓ అభ్యర్థిని పొరపాటున తన పరీక్షా కేంద్రానికి కాకుండా వేరే పరీక్షా కేంద్రానికి వెళ్లింది. అక్కడే విధులు నిర్వహిస్తున్న ఓ పోలీసు సిబ్బంది విషయం తెలుసుకుని ఆమెకు సాయం చేశాడు. వెంటనే ఆమెను తన బైక్‌పై ఎక్కించుకుని సకాలంలో సరైన పరీక్షా కేంద్రం వద్ద దింపాడు. ఇలాగే కీసరలో ఓ అభ్యర్థి పరీక్ష కేంద్రానికి రావడం ఆలస్యం కావడంతో ఇది గమనించిన ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటయ్య అతన్ని పెట్రోలింగ్ వాహనంలో గీతాంజలి ఇంజనీరింగ్‌ కాలేజీ పరీక్షా కేంద్రానికి తీసుకొచ్చాడు. దీంతో ఆ అభ్యర్థి సజావుగా పరీక్ష రాయగలిగాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement