Tuesday, November 26, 2024

RR: జూన్ 9న గ్రూప్ 1 పరీక్షలు పక‌డ్బందీగా నిర్వహించాలి… కలెక్టర్ నారాయణ రెడ్డి

వికారాబాద్ మే 31 ( ప్రభ న్యూస్) : గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను ప్రశాంత వాతావరణంలో జరిగేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అధికారులకు సూచించారు. జూన్ 9 న నిర్వహించే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి తీసుకోవలసిన జాగ్రత్తలు, విధి విధానాలపై శుక్రవారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో చీఫ్ సూపరింటెండెంట్ లు, శాఖపరమైన జిల్లా అధికారులు, రూట్ ఆఫీసర్ లు, ప్లయింగ్ స్క్వాడ్ లతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ను ఎలాంటి తప్పిదాలు లేకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలన్నారు. జిల్లాలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను 13 కేంద్రాల్లో 5468 మంది అభ్యర్థులు హాజరవుతున్నట్లు కలెక్టర్ తెలిపారు.

వికారాబాద్ లో 7, తాండూర్ లో 4, పరిగిలో 2 కేంద్రాల్లో పరీక్షల నిర్వహణకు అన్ని మౌలిక వసతులతో పాటు ఫర్నిచర్, త్రాగునీరు, నిరంతర విద్యుత్తు, ఫ్యాన్లు, టాయిలెట్లు వుండేలా జాగ్రతలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ప్రతి పరీక్ష కేంద్రంలో అత్యవసరమైన మందులతో పాటు వైద్య సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో మొబైల్, ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించకూడదని కలెక్టర్ అధికారులకు సూచించారు. టీఎస్ పీఎస్సీ మార్గదర్శకాలకు అనుగుణంగా పరీక్ష నిర్వహించాలని ఆయన సూచించారు.

- Advertisement -

పరీక్ష పత్రాలను స్ట్రాంగ్ రూమ్ నుండి పూర్తి పోలీస్ బందోబస్తు మధ్య, ప్రోటోకాల్ ప్రకారం పరీక్ష కేంద్రాలకు తీసుకురావాలని కలెక్టర్ తెలిపారు. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షల్లో విధులు నిర్వహించే సిబ్బందికి పూర్తిస్థాయి శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో అనధికార వ్యక్తులు లేకుండా పకడ్బందీ జాగ్రత్తలు చేపట్టాలన్నారు. ఈసమావేశంలో అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, గ్రూప్-1 రీజినల్ కోఆర్డినేటర్ డా.రాజేష్, కలెక్టరేట్ పరిపాలన అధికారి అమరేందర్ కృష్ణ లు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement