Tuesday, November 19, 2024

Group 1 -అర్థం చేసుకోండి … పంతాలు వద్దు: రేవంత్ కు బండి హితవు

హైదరాబాద్ – గ్రూప్‌-1 అభ్యర్థుల ఆవేదనను అర్థం చేసుకుని పంథాలు, పట్టింపులకు పోకుండా జీవో 29ని ఉపసంహరించుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్రమంత్రి బండి సంజయ్‌ సూచించారు. ఈ మేరకు ఆయన సీఎం రేవంత్‌కు నేడు లేఖ రాశారు.

రేపు పరీక్షలని తెలిసినా విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారంటూ పేర్కొన్న ఆయన్ నిరుద్యోగులంతా మీ కుటుంబ సభ్యులుగా భావించి వారి ఆవేదనను అర్థం చేసుకోవాలన్నారు. గ్రూప్‌-1 పరీక్షలను రీషెడ్యూల్ చేయాలన్నారు.

జీవో 29 కారణంగా గ్రూప్-1 పరీక్షల్లో 5,003 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు అనర్హలయ్యారన్నారు. 63 పోస్టులకు గుండుగుత్తగా 1:50 చొప్పున అభ్యర్థులను ప్రకటించడం అన్యాయమన్నారు.

- Advertisement -

ఈ మొత్తం పోస్టుల్లో 354 రిజర్వ్ పోస్టులని.. 29 జీవోతో ఓపెన్ కేటగిరిలో అర్హత సాధించిన రిజర్వ్ అభ్యర్థులను సైతం రిజర్వ్ కేటగిరీలో చేర్చడం అన్యాయమన్నారు. ఈ జీవోతో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల అభ్యర్థులు 1:50 చొప్పున అర్హత సాధిస్తే.. ఓసీ వర్గాలు 1:65 శాతం మేరకు అర్హత సాధించారన్నారు. జీవో నెంబర్ 29 రాజ్యాంగ స్ఫూర్తికి రూల్ ఆఫ్ రిజర్వేషన్‌కు వ్యతిరేకమన్నారు.

గ్రూప్-1 అభ్యర్థులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారని.. గ్రూప్-1 పరీక్షలను రీషెడ్యూల్ చేయకుంటే ఆత్మహత్యే శరణ్యమని వాపోతున్నారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement