Tuesday, November 26, 2024

నెలాఖరులో జీఆర్‌ఎంబీ సమావేశం.. పోలవరం కాలువల సామర్థ్యం పెంపుపై తెలంగాణ అభ్యంతరం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఈ నెలాఖరులో గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) సమావేశం జరగనుంది. గోదావరి నదిలో కేవలం 493. 5 టీఎంసీలనే ఏపీ వినియోగించుకునేలా కట్టడి చేయాలని తెలంగాణ కేంద్ర జలశక్తి శాఖను కోరిన నేపథ్యంలో త్వరలో జరగనున్న జీఆర్‌ఎంబీ సమావేశానికి ప్రాధా న్యత ఏర్పడింది. పోలవరం ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల నుంచి రోజు 1.7టీఎం సీల చొప్పున మొత్తం 449.78 టీఎంసీలను మాత్రమే తీసుకునేందుకు సీడబ్ల్యూసీ అనుమతించిందని కొద్ది రోజుల క్రితం కేంద్ర జలశక్తిశాఖకు తెలంగాణ నీటిపారు దల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ కుమార్‌ లేఖరాసిన విషయం తెలిసిందే. అయితేఏపీ అక్రమంగా రోజుకు ఆ టీఎంసీల నీటిని తరలించేందుకు కాలువల విస్తరణ పనులు చేపడుతుండడంపై జీఆర్‌ఎంబీ ఎదుట తెలంగాణ అభ్యంతరాల ను వ్యక్తం చేయనుంది.

నికర జలాల కేటాయింపులు లేకుండానే గోదావరిపై అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తున్న ఏపీ… అదే సమయంలో ఉమ్మడి రాష్ట్రంలో నికర జలాల ఆధారంగా తలపెట్టిన తెలంగాణ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు లేవంటూ పదే పదే ఫిర్యాదు చేయడాన్ని బోర్డు ఎదుట గట్టిగా ఏపీని నిలదీయాలని తెలంగాణ నిర్ణయించింది. ఈ మేరకు అవసరమైన కసరత్తును తెలంగాణ సాగునీటిపారుదల శాఖలోని గోదావరి నదీ విభాగం అధికారులు పూర్తి చేశారు. అదేవిధంగా తెలంగా ణలోని మోడికుంటవాగు, కడెం ప్రాజెక్టుల నిర్వహణపై తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులతో బోర్డు చర్చించనుంది. అదే సమయంలో గోదావరిపై నిర్మిస్తు న్న ఎత్తిపోతల ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్‌ల ఆమోదం పెండింగ్‌లో ఉన్న విషయాన్ని బోర్డు దృష్టికి తీసుకెళతామని తెలంగాణ ఇరిగేషన్‌శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement