Friday, November 22, 2024

Green India Challenge: మొక్కలు నాటిన ఎమ్మెల్యే రేగాకాంతారావు

తన పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, పినపాక శాసనసభ్యుడు రేగా కాంతారావు పాల్గొన్నారు. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పలు రకాల మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగస్వామ్యం కావడం ఎంతో సంతోషం ఉందన్నారు. ఇది పర్యావరణ పరిరక్షణకు ఒక నిజమైన చాలెంజ్ అని అన్నారు. ఎందుకంటే ఆక్సిజన్ కేంద్రాలు నెలకొల్పే పరిస్థితి మనకు వచ్చింది అంటే మనం మొక్కలు నాటడం, పెంచడం బాధ్యతగా తీసుకోవాలని తెలిపారు. మొక్కలు నాటి వాటిని సంరక్షించడం వల్ల నేలతల్లికి, అలాగే మానవ సమాజానికి ఎంతో ఉపయోగకరమని తెలిపారు. మనమందరం ఆరోగ్యకరంగా ఉండాలంటే మొక్కలు నాటడం చాలా అవసరమన్నారు. ప్రతి ఒక్కరు మొక్కలు పెంచే బాధ్యత తీసుకోవాలన్నారు. సీఎం కేసీఆర్ గారి మానస పుత్రిక హరితహారానికి మద్దతు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టి ప్రజలలో మంచి అవగాహన కల్పిస్తూ, చెట్లు నాటే విధంగా ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. ఇంతటి అద్భుతమైన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ప్రారంభించిన రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement