Tuesday, November 26, 2024

Green India Challenge – భావి త‌రాల బంగారు భ‌విత‌కు ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ – నోబుల్ శాంతి గ్రహీత కైలాష్ స‌త్యార్థి

హైద‌రాబాద్ – భావి తరాల బంగారు భవిత‌కు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని నోబుల్ శాంతి అవార్డు గ్ర‌హీత కె స‌త్య‌ర్ధి అన్నారు.  గ‌చ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ క్యాంప‌స్‌లో నిర్వ‌హించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్య‌క్ర‌మంలో ఎంపీ సంతోష్ కుమార్‌తో క‌లిసి నోబెల్ శాంతి బ‌హుమ‌తి గ్ర‌హీత కైలాష్ స‌త్యార్థి మొక్క‌లు నాటారు. .ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, ప‌ర్యావ‌ర‌ణాన్ని ప‌రిర‌క్షించేందుకు, గ్రీన‌రీని పెంపొందించేందుకు బిఆర్ఎస్ ఎంపి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా కార్య‌క్ర‌మాన్ని ఆయ‌న ప్ర‌శంసించారు.. ప్ర‌తి ఇంటితో పాటు గ్రామాలు, ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల‌లో ప్ర‌జ‌లు స్వ‌చ్చందంగా మొక్క‌లు నాటాల‌ని ఆయ‌న పిలుపు ఇచ్చారు.. మ‌నం నాటే ప్ర‌తి మొక్క భ‌విష్య‌త్ త‌రాల‌కు బాస‌ట‌గా ఉంటుంద‌ని అన్నారు.. భ‌విష్య‌త్ త‌రాల‌కు మంచి వాతావ‌ర‌ణాన్ని అందించాల‌నే ఉద్దేశంతో గ్రీన్ ఇండియా చాలెంజ్ చేప‌ట్ట‌డం గొప్ప విష‌య‌మ‌న్నారు. ఈ భూమ్మీద ప్ర‌తి ఒక్క‌రూ సంతోషంగా జీవించాల‌నే ల‌క్ష్యంతో ముందుకు వెళ్ల‌డం మంచి విష‌య‌మ‌న్నారు.

అనంత‌రం సంతోష్ కుమార్ మాట్లాడుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ 6.0 ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో నోబెల్ శాంతి బ‌హుమ‌తి గ్ర‌హీత కైలాష్ స‌త్యార్థి పాల్గొని మొక్క‌లు నాట‌డం సంతోషంగా ఉంద‌న్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా చెట్ల‌ను నాటేలా ప్రోత్సహిస్తామ‌న్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో ట్రిపుల్ ఐటీ ప్రొఫెస‌ర్ పీజే నారాయ‌ణ్‌, విద్యార్థులు, గ్రీన్ ఇండియా చాలెంజ్ ఫౌండ‌ర్ మెంబ‌ర్లు రాఘ‌వ‌, క‌రుణాక‌ర్‌తో పాటు ప‌ల‌వురు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా కైలాష్ స‌త్యార్థికి వృక్ష‌వేదం పుస్త‌కంతో పాటు హ‌రిత‌హాసం కార్టూన్ల‌ను అంద‌జేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement