Thursday, November 21, 2024

గిరిజన గూడేల్లో గిరి వికాసం…

హైదరాబాద్‌,  : వర్షాధార పంటలు పండిస్తూ కడు బీదరికంలో మగ్గుతున్న గిరిజన రైతుల జీవితాల్లో గిరివికాస పథకం వెలుగులు నింపు తోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో వ్యవసాయం మీద ఆధా రపడి జీవనం సాగిస్తున్న గిరిజన రైతులు ఏళ్లుగా సాగునీటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్య్రతేక తెలంగాణలో గిరిజన సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ విద్య, వైద్య, పారిశ్రామిక రంగాల్లో సైతం గిరిజన యువతను ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. వ్యవ సాయం రంగంలోనూ గిరిజన రైతులను ప్రోత్స హించేందుకు ‘గిరివికాస’ పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకం కింద పెద్ద సంఖ్యలో గిరిజన రైతులు లబ్ది పొందుతున్నారు.
పథకం కింద ప్రభుత్వం ఉచితంగా బోరుబావి తవ్వించడంతోపాటు విద్యుత్‌ సౌకర్యాన్ని సమకూ రుస్తోంది. దీంతో ఏజెన్సీ ప్రాంతాల్లోని వందలాది ఎకరాల బీడు భూములు సాగులోకి వస్తున్నాయి. గతం లో ఏడాదికి ఒక పంట సాగుకే పరిమితమైన గిరి జన రైతులు… గిరివికాస పథకంతో ఇప్పుడు ఏటా రెం డు పంటలు పండిస్తున్నారు. రైతులు గిరివికాస పథ కంతో మా తండాలు, గూడేలు వికసిస్తున్నాయని ఆనం దం వ్యక్తం చేస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లోని రైతులను వ్యవసాయ రంగంలో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఐటీడీఏకు ప్రత్యేక నిధులు కేటాయిచింది. గిరిజన తండాలు, గూడేల్లోని రైతులు బీడు భూము లను సాగులోకి తీసుకువచ్చేందుకు గిరివికాస పథకం కింద చిన్న , సన్నకారు రైతులకు వందశాతం సబ్సిడీ రుణ సౌకర్యం కల్పిస్తోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో పట్టా భూములు కలిగి ఉన్న గిరిజనులు.. పక్కపక్కనా భూ ములు కలిగి ఉన్న ఒక్కరిద్దరు రైతులు ఉమ్మడిగా దర ఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం రూ. 4లక్షల నుంచి రూ 5లక్షల వరకు రుణం ఇస్తోంది. దరఖాస్తు చేసుకున్న రైతుల భూములను నేరుగా అధికారులు పరిశీలించి… 10ఎకరాల నుంచి 15 ఎకరాల వరకు ఉన్న ఇద్దరు రైతులను గుర్తించి ఎంపికైన రైతుల భూముల్లో బోర్లు, విద్యుత్‌ సౌక్యరం కల్పిస్తూ బీడు భూములను సాగులోకి తెచ్చే వరకు పూర్తి బాధ్యతలను అధికారులే చూసుకుంటున్నారు.
బోరు మోటర్లతో.. సాగులోకి
గిరిజన రైతుల భూములను సాగులోకి తీసుకువ చ్చేందుకు ప్రభుత్వం బోర్లు వేయిస్తూ సాగు నీటి సౌకర్యం కూడా కల్పిస్తోంది. గిరివికాస పథకం కింద దరఖాస్తు చేసుకున్న రైతుల భూముల్లో భూగర్భ జలవనరుల శాఖ అధికారులు పరిశీలన మేరుకు భూ గర్భ జలాలు ఉన్న ప్రాంతాన్ని గుర్తించి బోర్లు వేయి స్తోంది. ఒక బోరు తవ్వడానికి రూ. 60 నుంచి 70 వేలు ఖర్చు చేస్తున్నారు. విద్యుత్‌ సౌకర్యం కోసం రూ. 80 వేలు ఖర్చు చేస్తోంది. పంప్‌ సెట్లు, భూముల్లో ఉన్న చె ట్లు , రాళ్లు తొలగించి సాగులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఆర్థికంగా సహకరిస్తోంది.
30వేల మంది రైతులు దరఖాస్తు
గిరివికాస పథకం కింద తమ భూముల్లో బోర్లు , విద్యుత్‌ సౌకర్యం కోసం కల్పించాలని ఇప్పటి వరకు రా ష్ట్ర వ్యప్తంగా 30వేల మంది చిన్న, సన్నకారు రైతులు దరఖస్తూ చేసుకున్నట్లు అధికారిక లెక్కలు చెబు తున్నాయి. దరఖాస్తు చేసుకున్న వారిలో 40శాతం మంది రైతుల భూములు సాగులోకి వచ్చా యి. ఉమ్మ డి రాష్ట్రంలో ఇందిరా జలప్రభ కార్యక్ర మంలో భాగం గా దరఖాస్తు చేసుకున్న అర్హులైన రైతులను కూడా ఈ పథకంలో చేరుస్తున్నారు.
వారి భూముల్లోనూ గిరివికాస పథకం కింద బోర్లు వేయించిన ప్రభుత్వం భూములును సాగులోకి తెచ్చింది. భూములు ఉన్నా సాగునీరు అందుబాటులో లేకపోవడంతో కూలినాలి చేస్తూ జీవనం గడిపేవారమని… ప్రస్తుతం గిరివికాస పథకం కింద ప్రభుత్వం సాగు నీటి సదుపాయం కల్పిస్తుండడంతో ఏటా రెండుపంటలను పండిస్తున్నామని ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement