Friday, November 22, 2024

Greater Hyderabad – ” హైడ్రా ” విధి విధానాలు విడుద‌ల‌…

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – హైద‌రాబాద్ – తెలంగాణ ప్రభుత్వం “హైడ్రా” విధివిధానాలు విడుదల చేసింది. హైడ్రా చైర్మన్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరించనున్నారు. సభ్యులుగా మున్సిపల్ శాఖ మంత్రి, రెవెన్యూ మంత్రి ఉండనున్నారు. అంతేకాకుండా.. హైదరాబాద్, రంగారెడ్డి ఇంఛార్జ్ మంత్రులు, జీహెచ్ఎంసి మేయర్, సీఎస్, డీజీపీ, ఎంఎయుడి ప్రిన్సిపల్ సెక్రటరీలు హైడ్రాలో సభ్యులుగా ఉంటారు.

ఆర్గనైజేషన్ & ఫీల్డ్ టీమ్‌లు:
హైడ్రా అవసరమైన సబ్ డివిజన్‌లు, అవసరమైన మెటీరియల్, పరికరాలు, వాహనాలతో కూడిన ఫీల్డ్ టీమ్‌లతో తగిన సంస్థ నిర్మాణాన్ని కలిగి ఉండాలి.

- Advertisement -

ట్రాఫిక్ సమన్వయం, నిర్వహణ:
ట్రాఫిక్ నిర్వహణ కోసం హైడ్రా, దాని అధికారులు రెగ్యులర్ ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకుంటారు. ముఖ్యంగా విపత్తుల సమయంలో ట్రాఫిక్‌ను నిర్వహించడానికి ప్రత్యేకంగా నీరు నిలిచిన ప్రాంతాలు, రోడ్డు దెబ్బతిన్న ప్రాంతాలు, విపత్తు పీడిత ప్రాంతాలు, తుఫానుపై ట్రాఫిక్ జామ్‌లకు ప్రాధాన్యత ఇస్తారు. భారీ వర్షాల సమయంలో నీరు మొదలైనవి క్లియర్ చేయాలి.

హైడ్రాకు బడ్జెట్ ప్రభుత్వం నుండి కేటాయింపు చేస్తుంది. GHMC, HMDA, TGIIC, TGSPDCL, HMWSSB, MRDCL, HGCL, ఇతర యుటిలిటీల వంటి సంస్థలు, స్థానిక అధికారుల నుండి చందాలు, రుసుముల ద్వారా నిధులు వినియోగిస్తారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ సబ్ కమిటీ ఛైర్మన్ గా ఎండి , యుడి ప్రిన్సిపల్ సెక్రటరీ, మెంబర్ కన్వీనర్ గా హైడ్రా కమిషనర్, సభ్యులుగా ప్రిన్సిపల్ సెక్రటరీ, రెవెన్యూ శాఖ, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, డిజి టిజి డిజాస్టర్ రెస్పాన్స్ & ఫైర్ సర్వీసెస్, వాటర్ సూయిజ్ బోర్డు మేనేజింగ్ డైరెక్టర్, హైద‌రాబాద్ డెవ‌ల‌ప్మెంట్ మెట్రోపాలిటన్ కమిషనర్, గ్రేట‌ర్ మ‌నిసిప‌ల్ కార్పారేష‌న్ కమిషనర్, హెచ్ ఎం ఆర్ ఎల్ మేనేజింగ్ డైరెక్టర్, టిజి ఎస్పీ డిసిఎల్ మేనేజింగ్ డైరెక్టర్, పబ్లిక్ హెల్త్ ఇంజనీర్-ఇన్-చీఫ్, టిసియుఆర్ ప్రాంతంలోని అన్ని జిల్లా కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, యుఎల్బీ ల మున్సిపల్ కమిషనర్లు, చైర్మన్, సబ్ కమిటీ నామినేట్ చేసిన ఇతర సభ్యులు ఉంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement