హైదరాబాద్ – వేయి మందికి పైగా సీఈఓలు, స్టార్టప్ వ్యవస్థాపకులు, పరిశ్రమ నిపుణులు పాల్గొనే టైకాన్ కేరళ 2024 లో పాల్గొనవలసిందిగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఆహ్వానం అందింది. ప్రతిష్టాత్మక టైకాన్ కేరళ 2024కి గౌరవ అతిథిగా పాల్గొనవలసిందిగా నిర్వాహకులు కోరారు.. ది ఇండస్ ఎంట్రప్రెన్యూర్స్ నిర్వహణలో ఆధ్వర్యంలో జరిగే ఈ సదస్సు డిసెంబర్ 4 ,5తేదీలలో కోచిన్లోని గ్రాండ్ హయత్ హోటల్లో జరుగనుంది.
కేరళ రాష్ట్రంలోనే అతిపెద్ద ఈవెంట్ గా పేరు ఉన్న13వ టైకాన్ కు వివిధ రంగాల సీఈఓలు, స్టార్టప్ వ్యవస్థాపకులు, పరిశ్రమ నిపుణుల వంటి 1,000 మందికి పైగా పాల్గొననున్నారు. ఈ ఏడాది థీమ్, “మిషన్ 2030 – ట్రాన్స్ఫార్మింగ్ కేరళ,” కేరళ ఆర్థిక వ్యవస్థను ఆధునీకరించేందుకు అవసరమైన ప్రణాళికలను వ్యూహాలను ఈ సదస్సు చర్చించనున్నది. . తెలంగాణ అభివృద్ధిలో ఆయన చూపిన గొప్ప నాయకత్వం, ఇన్నోవేషన్, ఎంటర్ప్రెన్యూర్షిప్లను తెలంగాణలో పెంపొందించడంలో ఆయన చేపట్టిన కార్యక్రమాలు, అనుసరించిన వ్యూహాలకు గుర్తింపుగా ఈ ఆహ్వానం లభించినట్లు చెతున్నారు.