Tuesday, September 17, 2024

Grand Welcome – హైద‌రాబాద్ చేరుకున్న‌రేవంత్ బృందం….

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – హైద‌రాబాద్ – రాష్ట్రంలో విదేశీ పెట్టుబడులే లక్ష్యంగా కొనసాగిన అమెరికా,కోరియాల ప‌ర్య‌ట‌న‌ను ముగించుకుని సీఎం రేవంత్ రెడ్డి నేడు హైద‌రాబాద్ కు చేరుకున్నారు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టు లో ఆయ‌న బృందానికి ప‌లువురు మంత్రులు, కాంగ్రెస్ నేత‌లు, భారీగా అభిమానులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.. అక్కడ నుంచి భారీ ఊరేగింపుగా రేవంత్ త‌న నివాసానికి బ‌య‌లుదేరారు.

ఇది ఇలా ఉంటే ఈ నెల 3న సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఐటీ మినిస్టర్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు బృందం అమెరికాలో విస్తృతంగా పర్యటించారు. వారం రోజుల పాటు అక్కడున్న ప్రముఖ సంస్థల సీఈవోలు, ఇన్వేస్టర్లతో ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్రంలోని ఇండస్ట్రియల్ పాలసీని వారికి వివరించారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా దక్షిణ కొరియాలోను వారి పర్యటన కొనసాగింది. పర్యటనలో భాగంగా మొత్తం రూ.31 వేల కోట్ల పెట్టుబడులను తెలంగాణకు తీసుకురావడంలో సీఎం రేవంత్ బృందం సక్సెస్ అయింది. 19 మల్టీ నేషనల్ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎంవోయూలు కూడా చేసుకోవడం శుభ పరిణామం. ఇవాళ సీఎం రేవంత్‌రెడ్డి కోకాపేటలో ప్రారంభం కాబోతున్న కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్‌కు శంకుస్థాపన చేయబోతున్నారు. ఈ నెల 5న రాష్ట్ర సర్కార్‌తో కాగ్నిజెంట్ ఎంవోయూ కుదుర్చుకుని కేవలం పది రోజుల్లోనే క్యాంపస్ విస్తరణకు శ్రీకారం చుట్టడం విశేషం.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement