Friday, November 22, 2024

మ‌ద్యం కోసం మ‌న‌వ‌డిని కిడ్నాప్ చేసిన తాత‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: మనుమళ్లు, మనుమ రాళ్లను అపురూపంగా చూసుకునే, జేజినాయన, తాతయ్యలను చూస్తాము. కానీ, అతను అలాంటి తాత కాదు. తాగుడుకు బానిసైన ఆ తాత మద్యం తాగేం దుకు కూతురు, భార్య డబ్బులివ్వలేదని, ఏకంగా నెలరోజుల వయస్సున్న మనుమడిని ఎత్తుకుపోయిన కసాయి తాత ఉదంతమిది. పాలుతాగే కొడుకు తన ఒడి నుంచి కనిపించకపోవడంతో ఆ తల్లి వేధన, రోధన వర్ణణాతీతం. కన్నకొడుకు ఆచూకి దొరక్క పోవడంతో తండ్రిపై కన్నకూతురు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

వివరాలు ఇలా ఉన్నాయి. బంజారా హిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని హకీంపేటలోని గౌసియా మసీదు ప్రాంతంలో మహ్మద్‌ ఖలీల్‌ తన భార్య,పిల్లలతో ఉంటున్నారు. ఆయనకు ఒక కూతురు యాస్మీన్‌. పెళ్లయింది. నెల రోజుల క్రితం యాస్మీన్‌ బేగం కాన్పుకోసం పుట్టింటికి వచ్చింది. ఏప్రిల్‌ 13న పండంటి మగశిశువుకు జన్మనిచ్చింది. కొడుకుకు
ఫైజన్‌ అని పేరు కూడా పెట్టుకుంది. ఈ నెల 14 న మద్యం సేవించేందుకు తన తండ్రి మహ్మద్‌ ఖలీల్‌ డబ్బులు అడిగారు. కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఇవ్వకపోవడంతో మీ సంగతి చూస్తా…నాకే డబ్బులివ్వరా ? అంటూ బెదరించాడు. ఆ రోజు రాత్రి యధావిధిగా యాస్మీన్‌ నిద్రపోయారు. ఇంట్లోవాళ్లు నిద్రపోతున్న సమయంలో కుమార్తె యాస్మీన్‌ పొత్తిళ్లలో నిద్రపోతున్న మనుమడిని ఖలీల్‌ ఎత్తుకుపోయాడు.

అర్ధరాత్రి యాస్మీన్‌ నిద్రలేచి చూస్తే పక్కన కొడుకు లేడు. తమ తల్లి తీసుకువెళ్లి పడుకోబెట్టుకుందని అమ్మను అడిగింది. ఆమెకూడా తాను మనుమడిని తీసుకోలేదని చెప్పడంతో ఒక్కసారిగా యాస్మీన్‌ గుండెపగిలింది. తన చిన్నారి కొడుకు ఎక్కడికెళ్లాడని రోధించింది. చుట్టుపక్కల ప్రాంతాలలో ఆరా తీసింది. బాబు కనిపించకపో వడంతో తల్లితో కలిసి యాస్మీన్‌ బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. వెంటనే అలర్ట్‌ అయిన పోలీసులు బంజారాహిల్స్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో సీసీ కెమెరాలు చెక్‌ చేశారు. ఎక్కడ కూడా బాబు కనిపించలేదు. త్వరలో పట్టుుకంటామని పోలీసులు భరోసా ఇచ్చారు. కేసు రిజిస్టర్‌ చేసుకున్న పోలీసులు యాస్మీన్‌ కొడుకు కోసం గాలిస్తున్నారు.

పాలుతాగే బిడ్డ రెండు రోజులైనా కనిపించక పోవడంతో యాస్మీన్‌ బాధను వర్ణించలేం. తన బిడ్డ ఎక్కడున్నాడో అంటూ కనిపించిన వారినల్లా అడుగుతూ రోధిస్తోంది. నా కొడుకును నాకివ్వండి… నా బేటా ఎక్కడికి వెళ్లిండంటూ కనబడిన వారినంతా అడుగుతోంది. తన తండ్రి ఇంతటి పనికి ఒడిగడ తాడని అనుకోలేదని ఆమె చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement