Friday, November 22, 2024

Basara: ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు… పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే విఠల్ రెడ్డి

గురుపౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగిన మూడో రోజు ముగింపు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ముదోల్ నియోజవర్గం ఎమ్మెల్యే.జి.విట్టల్ రెడ్డి హాజరై వ్యాసభగవానుడికి పట్టు వస్త్రాలను సమర్పించి అమ్మవార్లను దర్శించుకున్నారు. తెల్లవారు జామునుంచే తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి వచ్చిన భక్తులు క్యూ లైన్ లో బారులు తీరారు. తల్లిదండ్రులు తమ చిన్నారులకు ఆలయ అర్చకుల చేత అక్షర శ్రీకర, కుంకుమార్చన పూజలు చేయించారు. శ్రీ వేదవ్యాస ఆలయాన్ని ఆలయ అధికారులు ప్రత్యేక పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు.

ఆలయాల్లో సాధారణ భక్తులు మొదలుకొని, విఐపిల వరకు అమ్మవార్లను దర్శించుకుంన్నారు. సరస్వతి అమ్మవారిని దర్శించుకునే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురుపౌర్ణమి లేదా వ్యాసపౌర్ణమిని వ్యాసమహాముని పుట్టిన రోజు కావున ఈ రోజుకింత ప్రాధాన్యత ఉండడంతో చదువు చెప్పే గురువును, మంత్రోపదేశం చేసిన గురువును యథోచితంగా సత్కరించారు. గురువులోనే వ్యాసదేవుని భావించి అత్యంత భక్తి శ్రద్దలతో గురువులను, ఉపాధ్యాయులను తమకు అత్యంత ఇష్టమైన గురువుని పూజిస్తూ గురువులకు కానుకలు, బహుమతులు సమర్పించి సత్కరిస్తూ గురువు నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement