Tuesday, November 26, 2024

తెలంగాణలో అకాల వర్షం.. తడిసి ముద్దైన ధాన్యం

తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. నిన్న రాత్రి నుండి నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ తదితర జిల్లాల్లో వర్షం కురిసింది. కామారెడ్డి జిల్లాలో అకాల వర్షానికి పలుచోట్ల ధాన్యం తడిసి ముద్దయింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు తీరా చేతికొచ్చాక వర్షార్పణం అవుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం, అకాల వర్షాలు రైతన్నలను నిండా ముంచుతున్నాయి. సోమవారం రాత్రి గంటసేపు కురిసిన వర్షానికి కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో కల్లాల్లో ఆరబోసిన ధాన్యం కుప్పలు పూర్తిగా తడిసిపోయాయి. దీంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

మరోవైపు కామారెడ్డి పట్టణ శివారులో 44వ నెంబరు జాతీయ రహదారి వద్ద పలువురు రైతులు ఆందోళనకు దిగారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ ధాన్యం తడిసిపోయిందని ఆరోపించారు. వారం రోజులుగా ధాన్యం కొనుగోలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ రోడ్డు ఎక్కి నిరసన వ్యక్తం చేశారు.

కాగా, కొనుగోళ్లు ఆలస్యం అవుతుండటంతో కల్లాల్లోనే ధాన్యం కుప్పలుకుప్పలుగా పేరుకుపోయింది. తడిసిన ధాన్యం రంగు మారుతోంది. తేమ ఎక్కువగా ఉన్న చోట మొలకలు వస్తున్నాయి. నిబంధనలు సడలించి ప్రభుత్వం వీటిని కొనకపోతే రైతులు మరింత నష్టపోనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement