Friday, November 22, 2024

Breaking: ధరణి దరఖాస్తుల పరిశీలనకు.. గడువు పొడిగించిన ప్ర‌భుత్వం

తెలంగాణ రాష్ట్ర‌ ప్రభుత్వం ధరణి దరఖాస్తుల పరిశీలన గడువును పెంచింది. ఈనెల 17వ తేదీ వరకు పొడిగిస్తూ సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ధరణి పెండింగ్‌ దరఖాస్తులకు సంబంధించిన స్పెషల్‌ డ్రైవ్‌ ఈనెల 1 నుంచి 9 వరకు నిర్వహించి పరిష్కారించాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ డ్రైవ్‌లో ఇప్పటి వరకు 1.06 లక్షల దరఖాస్తులకు పైగా రెవెన్యూ బృందాలు క్షేత్రస్థాయిలో పరిశీలించి, డెస్క్‌వర్క్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం.

పెండింగ్‌ దరఖాస్తుల పరిశీలనకు తహసిల్దార్‌ కార్యాలయం సిబ్బందిని ప్రత్యేక బృందాలుగా నియమించారు. ఈ బృందాలు ప్రస్తుతం ధరణి పెండింగ్‌ దరఖాస్తులకు సంబంధించిన రికార్డులను పరిశీలిస్తూ, ఫీల్డ్‌లో కూడా దరఖాస్తుదారుడే ఉన్నాడా.. లేదా? అన్నది నిర్ధారించుకునేందుకు క్షేత్ర స్థాయి సర్వే చేపట్టాయి. ధరణి పోర్టల్‌లో ఆర్డీవోలు, తహసీల్దారులకు లాగిన్‌ ఆదేశాలు రాగానే పెండింగ్‌ దరఖాస్తుల అన్‌లైన్‌ వర్క్‌ త్వరలో ప్రారంభం అవుతుందని రెవెన్యూ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement