37 కార్పొరేషన్లకు ఛైర్మన్‌లను కాంగ్రెస్ ప్రభుత్వం నియమించింది. టికెట్ ఆశిస్తున్న పలువురికి అసంతృప్తి కలగకుండా నామినేటెడ్ పదవులు కట్టబెట్టింది. ఖాళీగా ఉన్న ప్రభుత్వ కార్పొరేషన్లతో పాటు కొత్తగా ఏర్పాటైనవాటిలో కూడా భర్తీ చేసింది.
పార్టీలో చురుగ్గా పనిచేసినవారిని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గుర్తించి వారికి ఈ పదవులను కట్టబెట్టారు. సూర్యాపేట నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించి చివరి నిమిషంలో అవకాశాన్ని కోల్పోయిన పటేల్ రమేశ్‌రెడ్డికి నామినేటెడ్ పోస్టు వరించింది. రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా మల్‌రెడ్డి రాంరెడ్డి, టూరిజం డెవల్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా పటేల్ రమేశ్ రెడ్డి, ఇండస్ట్రీయల్ ఇన్‌ఫ్ట్రాస్ట్రక్చర్ చైర్మన్‌గా నిర్మలా జగ్గారెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్‌గా నేరెళ్ల శారద, వైశ్య కార్పొరేషన్ చైర్మన్‌గా కాల్వ సుజాత, ఎస్‌సీ కార్పొరేషన్ చైర్మన్‌గా ఎన్. ప్రీతమ్ సహా మొత్తం 37 మందికి అవకాశం కల్పించారు. కింది లిస్ట్‌లో మొత్తం వివరాలు పేర్కొనడం జరిగింది.