తెలంగాణలో కరోనా నేపథ్యంలో 18 నెలల తర్వాత పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని రాజ్‌భవన్ స్కూల్‌ను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పరిశీలించారు. స్కూల్ కు వచ్చిన విద్యార్థులతో ఆమె ముచ్చటించారు. విద్యార్థులు, తల్లిదండ్రులకు పలు సూచనలు చేశారు. అనంతరం గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ.. పాఠశాలను అధికారులు బాగా శుభ్రం చేయించారన్నారు. విద్యార్థులు సంతోషంగా, నిర్భయంగా స్కూలుకు వచ్చారని తెలిపారు. మాస్కు ధరించడంపై విద్యార్థులకు అవగాహన ఉందన్న గవర్నర్.. పిల్లలకు వ్యాక్సిన్ వచ్చేంత వరకు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. చిన్నారులకు వ్యాక్సినేషన్ ను త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులను ధైర్యంగా స్కూల్స్ కు పంపుతున్న తల్లిదండ్రులను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అభినందించారు.
ఇది కూడా చదవండి: దేశంపై కరోనా గ్రహణం.. ఒక్క రోజులో భారీగా పెరిగిన కేసులు