తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై కు సైబర్ నేరగాళ్లు షాక్ ఇచ్చారు.. . గవర్నర్ తమిళిసై అధికారిక ట్విట్టర్ (X) అకౌంట్ @DrTamilisaiGuv హ్యాక్ చేశారు.. ఈ ఖాతాలో అనుమానాస్పద లింక్ లు ఉన్నట్లు గుర్తించిన అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు.. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు రాజ్ భవన్ అధికారులు. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.