Saturday, November 23, 2024

TS: ‘వీక్షిత్ భరత్ సంకల్ప’ యాత్రను ప్రారంభించిన గవర్నర్ తమిళి సై

శామీర్ పేట, డిసెంబర్ 16 (ప్రభన్యూస్): గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై అవగాహన కల్పించడం కోసమే వీక్షిత్ సంకల్ప యాత్ర ఉద్దేశమని రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ అన్నారు. శనివారం మేడ్చల్ జిల్లా శామీర్ పేట మండలం బొమ్మరాసిపేటలో భారత్ సంకల్ప యాత్రను ఆమె ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం ఎంతో దూర దృష్టితో అనేక ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతుందని తెలిపారు.

ప్రధాని నరేంద్ర మోడీ తీసుకొచ్చిన ఎన్నో కార్యక్రమాలను భారతదేశ ప్రజలందరికీ తెలిసే విధంగా రథయాత్రను ప్రారంభించడం జరుగుతుందని గవర్నర్ తమిళి సై అన్నారు. దేశం అంతటా మూడు వేల రథాలు ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ వద్దకు వచ్చి నరేంద్ర మోడీ చేపట్టిన అన్ని కార్యక్రమాలను ప్రజలకు సవివరంగా తెలిసే విధంగా రథయాత్రను ప్రారంభించారన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ అడిషనల్ సెక్రటరీ ఫైనాన్షియల్ అడ్వైజర్ శాంతమను, జనరల్ మేనేజర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్, అడిషనల్ కలెక్టర్ విజయేందర్ రెడ్డి, అధికారులు ప్రజాప్రతినిధులు, జెడ్పీటీసీ అనిత లాలయ్య, ఎంపీపీ దాసరి యెల్లుబాయి, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement