Friday, November 22, 2024

Governor – తమిళ సై సంచలన వ్యాఖ్యాలు…నాపై రాళ్లు వేస్తే గాయంతో వచ్చే రక్తంతో చరిత్ర రాసుకుంటా ..

హైద‌రాబాద్ – కెసిఆర్ ప్ర‌భుత్వం , గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై మ‌ధ్య నిత్య‌వివాదాలు కొన‌సాగుతూనే ఉన్నాయి.. ఇటీవ‌ల కేబినేట్ ప్ర‌తిపాదించిన కోటా ఎమ్మెల్సీ పేర్ల‌ను గ‌వ‌ర్న‌ర్ తిర‌స్క‌రించ‌డంతో ఈ వివాదం మ‌రింత ముదిరింది.. గ‌వ‌ర్న‌ర్ వ్య‌వ‌హార శైలిని త‌ప్పు ప‌డుతూ కెటిఆర్ తో స‌హా ప‌లువురు మంత్రులు, సీనియ‌ర్ నేత‌లు తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు.. దీనిపై త‌మిళ సై ప‌రోక్షంగా స్పందిస్తూ సంచ‌ల‌న వ్యాఖ్యాలు చేశారు..మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభ లో గ‌వ‌ర్న‌ర్ మాట్లాడుతూ, ప్రొటోకాల్ పాటించినా ,పాటించ‌క‌పోయినా త‌న ప‌ని తాను చేసుకుపోతాన‌ని అన్నారు..

మీరూ రాజ‌కీయ నేతగా ఉండ‌గానే గ‌వ‌ర్న‌ర్ అయ్యార‌న్న విమ‌ర్శ‌ల‌కు కౌంట‌ర్ ఇస్తూ, ” ఒకప్పుడు నేను బిజెపి నేతను.. ఇప్పుడు గవర్నర్‌ను. రాజకీయాలపై ఇష్టం వల్లే వైద్య వృత్తికి దూరంగా ఉన్నా. రాజకీయాల్లో పురుషాధిక్యత ఎక్కువ. నేను గవర్నర్‌గా వచ్చినప్పుడు తెలంగాణా కేబినేట్ లో ఒక్క మహిళా మంత్రి కూడా లేరు. గవర్నర్‌గా వచ్చే నాటికి ఇద్దరు మహిళలు మంత్రులు అయ్యారు. నాపై పువ్వులు వేసే వారు ఉన్నారు.. రాళ్లు వేసే వారున్నారు. నాపై రాళ్లు వేస్తే.. వాటితో భవంతి కడతా. నాపై పిన్స్‌ వేస్తే.. ఆ పిన్స్‌ గుచ్చుకుని వచ్చే రక్తంతో నా చరిత్ర బుక్‌ రాసుకుంటా. అందరూ అందరికీ నచ్చాలని లేదు. నాపై పువ్వులు వేసినా.. రాళ్లు వేసినా ఆహ్వానిస్తా. మంచి పనులు చేయడానికి అధికారం ఉండాలి. ఎలాంటి అవమానాలు పట్టించుకోను.. ప్రజల కోసం పనిచేస్తా” అని గవర్నర్ స్ప‌ష్టం చేశారు. అలాగే తమకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించిన ప్రధాని మోడీకి ఆమె ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement