హైదరాబాద్‌లో ఇవ్వాల (సోమవారం) రాత్రి గవర్నర్ తమిళిసై ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. గవర్నర్ ప్రయాణిస్తున్న వాహనం హెవీ ట్రాఫిక్‌లో నిలిచిపోయింది. ఖైరతాబాద్ హనుమాన్ టెంపుల్‌కు వచ్చిన గవర్నర్ తిరుగు ప్రయాణంలో రాజ్‌భవన్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఖైరతాబాద్, ఎర్రమంజిల్ మార్గంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. ట్రాఫిక్ పోలీసుల సమన్వయంతోనే ఇట్లా జరిగిందని తెలుస్తోంది. కాగా, గవర్నర్ భద్రతా సిబ్బంది ట్రాఫిక్ని కంట్రోల్ చేసే పనిలో నిమగ్నమయ్యారు.
ఇక.. చలాన్లు వేయడంలో, వేహికల్స్ని ఆపి ఫొటోలు తీయడంలో ఉన్న శ్రద్ధ ట్రాఫిక్ని కంట్రోల్ చేయడంలో చూపించడం లేదని, రోజూ 50 కేసుల టార్గెట్ల పేరుతో కానిస్టేబుళ్లను వేధింపులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ విషయంలో ఉన్నతాధికారులు చొరవ తీసుకుని అసలు విషయమ్మీద ఫోకస్ పెట్టకపోతే గుడ్ కాప్స్ అన్న పేరు కాస్త బ్యాడ్ కాప్స్గా మారే ప్రమాదం ఉందని చాలామంది అంటున్నారు.