Monday, November 18, 2024

TS: పద్మశ్రీ కూరెళ్ల నివాసానికి గ‌వ‌ర్న‌ర్‌….గ్రంథాలయ భవనం ప్రారంభోత్సవం..

రామ‌న్న‌పేట మండ‌లంలోని వెల్లండి గ్రామానికి చెందిన ఆచార్య కూరెళ్ల విఠ‌లాచ‌ర్య ఎంపిక‌య్యారు. అయితే ఇవాళ ఆయ‌న నివాసానికి గ‌వర్నర్‌ తమిళిసై సౌందర రాజన్ రానున్నారు. కూరెళ్ల ట్రస్ట్‌ ఆధ్వర్యంలో రెండు కోట్ల రూపాయలతో నిర్మించిన కూరెళ్ల గ్రంథాలయాన్ని ప్రారంభించనున్నారు.

పాండిచ్చేరి పర్యటనలో ఉన్న గవర్నర్ ఈ ఉదయం చెన్నై విమానశ్రయం నుంచి హైదరాబాద్‌ చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం గుండా బయలు దేరి 1 గంటకు వెల్లంకికి చేరుకుంటారు. గ్రంథాలయం ప్రారంభించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు.

కాగా, పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన ఆచార్య కూరెళ్ల విఠలాచార్య గ్రంథాలయం పై అంతస్తులో నూతన భవనం (సాయి సభ మందిరం) ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ దీనిని ప్రారంభించనున్నారు. అలాగే విఠలాచార్య రచించిన కూరెళ్ల శతకం ద్వితీయ ముద్రణను ఆవిష్కరించనున్నారు. హైకోర్టు జడ్జి కూనూరు లక్ష్మణ్‌ అధ్యక్షతన జరిగే సభకు కలెక్టర్‌ హనుమంతు జెండగే, నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం, ప్రముఖ సినీగేయ రచయిత, ఆస్కార్‌ అవార్డు గ్రహీత కనుకుంట్ల సుభాశ్‌చంద్రబోస్‌, జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు పోరెడ్డి రంగయ్య హాజరు కానున్నారు. మధ్యాహ్నం సాహిత్య సదస్సును నిర్వహించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement