హైదరాబాద్ – కెఎంసి పిజి మెడికల్ విద్యార్ధి ప్రీతి ఆరోగ్యం పై తప్పుడు సమాచారం ఇచ్చి నిందితుడ్ని కాపాడేందుకు ప్రయత్నించారని యూనివర్సిటీ అధికారులపై గవర్నర్ తమిళి సై ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ కాళోజీ హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ వీసీకి గవర్నర్ లేఖ రాశారు.. మెడికల్ కాలేజీలలో యాంటి రాగింగ్ కు చర్యలు తీసుకోవాలని కోరారు. మహిళా మెడికోలకు ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ , కౌన్సిలింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఏర్పాటు చేయాలని చెప్పారు. ఇలాంటి సంఘటనలలో ఎలాంటి ఉదాసీనత లేకుండా, తక్షణం స్పందించి కాలేజీలలో బాధ్యులపై కఠిన తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రతి మెడికల్ కాలేజీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. అలాగే.. పీజీ మెడికోల డ్యూటీ సమయాలు, వారికి సంబందించి సరైన విశ్రాంతి లాంటి అంశాలపై శ్రద్ధ పెట్టాలని చెప్పారు
Advertisement
తాజా వార్తలు
Advertisement