గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు MLC స్థానాలకు కాంగ్రెస్ పార్టీ ఇద్దరి పేర్లను ఖరారు చేసింది. గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరాం, విద్యాసంస్థల అధినేత జాఫర్ జావీద్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కోదండరాంను తక్షణం MLC చేయాల్సిన అవసరం ఉన్నదని సీఎం రేవంత్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఆసక్తికర చర్చ మొదలైంది. మరోస్థానానికి హైదరాబాద్లో విద్యాసంస్థలను నిర్వహిస్తున్న జావీద్ జాఫర్ పేరును కాంగ్రెస్ పరిశీలిస్తుంది.
తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ కోదండరాం పోషించిన పాత్ర, ప్రొఫెసర్గా సేవల ఆధారంగా ఆయన పేరును రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించి గవర్నర్కు పంపే అవకాశముంది. రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ రాజకీయాలతో ముడిపెట్టకుండా ఉండేలా ప్రభుత్వం నుంచి వెళ్ళే ఫైల్లో నిర్దిష్టంగా వివరాలను పేర్కొనేలా జాగ్రత్తలు తీసుకుంటుంది. గత ప్రభుత్వంలో దాసోజు శ్రవణ్, కుర్ర సత్యానారాయణ విషయంలో గవర్నర్ భిన్నంగా స్పందించడంతో ఈసారి అలాంటి చేదు అనుభవం ఎదురు కాకుండా వ్యవహరించాలని భావిస్తోంది.
మరోస్థానానికి హైదరాబాద్లో ముఫకంజా, సుల్తాన్ ఉల్ ఉలూమ్ లాంటి విద్యాసంస్థలను నిర్వహిస్తున్న జావీద్ జాఫర్ పేరును కాంగ్రెస్ పరిశీలిస్తోంది. రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తి కావడంతో విద్యారంగం తరఫున ఆయనను ప్రతిపాదించాలనుకుంటుంది. త్వరలోనే క్యాబినెట్ లో నిర్ణయం తీసుకుని రాబోయే స్టేట్ బడ్జెట్ సమావేశాల్లోపే ఫైనల్ చేయాలని ఆలోచిస్తుంది.