హైదరాబాద్, ఆంధ్రప్రభ : పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 15వ స్నాతకోత్సవం జులై 20న నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అధ్యక్షత వహిస్తారు. రాష్ట్ర మానవ హక్కుల సంఘం చైర్మన్ జస్టిస్ జి.చంద్రయ్యకు తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను అందజేయనుంది. నాలుగేళ్లుగా విశ్వవిద్యాలయంలో ఎంఫిల్, పీహెచ్‌డీ పూర్తి చేసిన విద్యార్థులు, ఆయా ప్రముఖుల పేరిట నెలకొల్పిన బంగారు పతకాలతో పాటు స్నాతకోత్సవ పట్టాలను పలువురికి గవర్నర్ అందజేయనున్నారు.
వివిధ కోర్సుల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు స్నాతకోత్సవంలో పట్టాలను అందజేయనున్నారు. స్నాతకోత్సవంలో యూనివర్సిటీ వీసీ తంగెడ కిషన్‌రావు తెలుగు విశ్వవిద్యాలయ ప్రగతి నివేదికను సమర్పించనున్నారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్, పీఠాధిపతులు, నిర్వహణ మండలి సభ్యులు పాల్గొంటారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.