Friday, November 22, 2024

TS : ప్రభుత్వాలు శాశ్వతం కాదు… పద్ధతి మార్చుకోవాలి.. మాజీ మంత్రి హరీష్ రావు

ఉమ్మడి మెదక్ బ్యూరో, ప్రభన్యూస్ : ప్రభుత్వాలు శాశ్వతం కాదు పద్ధతి మార్చుకోవాలని పోలీసు అధికారులకు సూచిస్తున్నట్లు హరీష్ రావు స్పష్టం చేశారు. పటాన్ చెరు ఎమ్మెల్యే సోదరిని అరెస్టును ఖండిస్తూ మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం నిర్వ‌హించారు.

- Advertisement -

ప్రతిపక్ష పార్టీల నాయకులను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవడం, ఎంతసేపు మా పార్టీలోకి నువ్వు వస్తావా రాకపోతే నీ మీద కేసులు పెడతా, పార్టీలో చేరాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ రకరకాల ఒత్తిళ్లకు గురిచేస్తుంద‌న్నారు. పార్టీలో చేరకపోతే అక్రమ కేసులు బనాయించే విధంగా కొనసాగుతుంద‌ని తెలిపారు. ఖమ్మం లాంటి పట్టణాల్లో 3, 4 రోజులకోసారి తాగునీరు వస్తుందన్నారు. కాంగ్రెస్ 100 రోజుల్లో హామీలు అమలుపర్చుతామని ఘోరంగా విఫలమైంద‌ని ఆరోపించారు. పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోదరుని ఇంటికి ఉదయం 3 గంటలకు వందల మంది పోలీసులు వెళ్లి, ఆయనను అరెస్టు చేసే ప్రయత్నం చేశార‌ని, ఆయన ఏమన్నా బందిపోటా టెర్రరిస్ట్ ఆ… రేపిస్టా ఆ.. ఎందుకు ఆయనను మూడు గంటలకు వందలాదిమంది పోలీసులు వెళ్లి అరెస్టు చేయాల్సిన అవసరం ఏముందన్నారు.

భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేయడమేన‌న్నారు. అరెస్టు చేసేటప్పుడు కొన్ని విధానాలు ఉంటాయి. నోటీస్ ఇవ్వాల్నా వద్దా..? ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాల్నా వద్దా..? మబ్బుల మూడు గంటలకు అరెస్టు చేస్తారు ఉదయం 10 గంటల వరకు అడిగితే ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వరు మీరు, ఇది ఎక్కడి విధానము అని అడుగుతా ఉన్నామ‌న్నారు. తాను పోలీస్ అధికారులను కూడా ఇప్పుడు కోరుతున్నా ఏ ప్రభుత్వము కూడా శాశ్వతం కాదని, దయచేసి పద్ధతులు మర్చిపోవ‌ద్ద‌ని, దయచేసి మితిమీరి ప్రవర్తించొద్దని పోలీసు అధికారులను కోరుతున్నట్టు చెప్పారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఈ విధంగా ఎప్పుడు తాము అధికార దుర్వినియోగానికి పాల్పడలేదన్నారు. ఇవాళ నాన్ అప్లికేబుల్ సెక్షన్స్, ఆ సెక్షన్స్ కానే కాదు, అయినప్పటికీ అక్రమ సెక్షన్స్ పెట్టి, ఏదోరకంగా అరెస్టు చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. బేలబుల్ సెక్షన్స్, సాధారణంగా అవన్నీ కూడా బేలబుల్ అఫెన్సెస్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది స్టేషన్ బెయిలే ఇవ్వాలని, కానీ స్టేషన్ బెయిల్ ఇచ్చే అవకాశం ఉన్న కూడా బెయిలబుల్ అవకాశం ఉన్న కూడా సివిల్ మేటర్ అఫెన్సెస్ అయిన కూడా, ఏదో ఒక రకంగా ఆరెస్ట్ చేయాలి, జైలుకు పంపాలి, క్యారెక్టర్ ను డామేజ్ చేయాలి, మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టాలి, ఆ రకంగా వీళ్లను లొంగ తీసుకొని కాంగ్రెస్ పార్టీలో చేరదీర్చుకోవాలని చూస్తుంద‌న్నారు.

ఈ రకంగా కేసులు పెట్టి సతాయిస్తాం, మరిన్ని కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తాం, బిడ్డ నువ్వు వస్తావా రావా అన్నట్టు వంటి రీతిలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు ఉన్నాయి అన్నారు. ఇది మంచి పద్ధతి కాదు ఇటువంటి విధానాలు మానుకోవాలని సూచించారు. ప్రజలకు సేవ చేయడానికి అవకాశం ఇచ్చారు కానీ ఇవాళ మీరు ప్రతిపక్షాలను లేకుండా చేస్తాం.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తాం… ప్రతిపక్షాలను వేధింపులకు గురి చేస్తామని ప్ర‌వ‌ర్తించే విధానాన్ని మానుకోవాల‌న్నారు.

తప్పు చేసినట్లయితే ప్రూఫ్ ఇవ్వండిః ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
తాము తప్పు చేసినట్లయితే ప్రూఫ్ ఇవ్వాల‌ని ఎమ్మెల్యే గూడెం మ‌హిపాల్‌రెడ్డి తెలిపారు. పెనాల్టీ వేయాల‌ని, ఇచ్చిన దానికంటే అదనంగా మేము క్రషింగ్ చేస్తే మా పైన చర్యలు తీసుకోవాల‌ని, ఇవి విధివిధానాలు, కానీ మా మీద మీరు అనవసరమైనటువంటి కేసులు పెట్టి ఉదయం 3 గంటలకు ఉన్నపాటుగా ఒక దొంగనా ఆరెస్ట్ చేసిన విధంగా ఒక మర్డర్ చేసిన వ్యక్తిని అరెస్టు చేసే విధంగా వందమంది పోలీసులకు పైపుగా వచ్చి ఇంటి మీద అటాచ్ చేయడం జరిగిందన్నారు. ఇదంతా కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద జరుగుతున్న ప్రతీకార చర్యలని ఇలాంటి చర్యలకు పాల్పడుద్దని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు గానీ అధికార యంత్రాంగం గాని, ఎమ్మెల్యేలు గానీ మంత్రులు గాని, ఇలాంటి విధానాలను మార్చుకోవాలని, పద్ధతి ప్రకారం తప్పు చేసిన వారిని శిక్షించే విధానాలు ఉంటాయని, ఇలా అక్రమంగా అరెస్టు చేయడం తగదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement