Monday, November 4, 2024

TG | వైద్య, ఆరోగ్య సేవలకు ప్రభుత్వం పెద్దపీట : దామోదర్ రాజనర్సింహ

ఉమ్మడి మెదక్ బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో పేద, మధ్య తరగతి ప్రజల వైద్య సేవలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వైద్య రంగాన్ని అత్యుత్తమంగా తీర్చిదిద్ది వైద్య, ఆరోగ్య సేవలకు పెద్ద పీట వేస్తున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు.

సోమవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ నర్సాపూర్ ఏరియా ఆసుపత్రిలో రూ.50లక్షలతో నూతనంగా 5 బెడ్స్ సామర్థ్యంతో ఏర్పాటు చేసిన ఆధునిక డయాలసిస్ కేంద్రాన్ని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్ రావులతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో అత్యుత్తమంగా తీర్చిదిద్ది ప్రతి పేద, మధ్య తరగతి ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువస్తామని, రూరల్ ప్రాంతంలో కూడా డయాలసిస్ సేవలను అందుబాటులోకి తెస్తున్నామని, ఈ క్రమంలోనే నర్సాపూర్ లో ఆధునిక డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించామన్నారు..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement