Saturday, November 30, 2024

ADB | పేదలను ఆర్థికంగా ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యం.. ఎమ్మెల్యే బొజ్జు పటేల్

జన్నారం, నవంబర్ 30 (ఆంధ్రప్రభ): పేదలను ఆర్థికంగా ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని 29 గ్రామపంచాయతీలోని 11 మంది లబ్ధిదారులకు రూ.1,101,276.00 చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ముందుగా మండలంలోని మహమ్మదాబాద్, చింతగూడ, కిష్టాపూర్, జన్నారం, మురిమడుగు, కలమడుగు గ్రామాలలో డీసీఎంఎస్, ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వం అన్నిరకాల సన్నవడ్లను కొనుగోలు చేస్తూ రూ.500ల‌ బోనస్ ఇస్తుందన్నారు. అన్ని విధాల రైతులను ఆదుకుంటుందని ఆయన చెప్పారు. రూ.2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో తమ ప్రభుత్వమే రైతులకు చేసిందని ఆయన స్పష్టం చేశారు. వడ్లను కొనుగోలు కేంద్రంలోని అమ్మి రైతులు లబ్ధిపొందాలని ఆయన సూచించారు.

రైతులను మోసం చేస్తే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ రాజమనోహర్ రెడ్డి, ఎంపీడీఓ ఠాగూర్ శశికళ, ఎంపీ జలంధర్, ఐకెపి ఎపిఎం బుచ్చన్న, చింతగూడ, పొనకల్ సింగిల్ విండో చైర్మన్లు నాసాని రాజన్న, అల్లం రవి, కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement