Tuesday, November 26, 2024

TS: నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యం.. మంత్రి శ్రీధర్ బాబు

విద్యార్థుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు
బడిబాట ముగింపు సందర్భంగా పలు కార్యక్రమాలు ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు

మంథని: నాణ్యమైన విద్యను అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. బుధవారం మంథని పట్టణం జడ్.పి.హెచ్.ఎస్ బాలురు పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ బడిబాట ముగింపు కార్యక్రమంలో ఐటి శాఖ మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మంత్రి శ్రీధర్ బాబుకు అధికారులు, పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో విద్యార్థులనుద్దేశించి మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ… ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. బడిబాట కార్యక్రమం ద్వారా విద్యార్థుల ప్రాథమిక అవసరాలు తెలుసుకునే అవకాశం కలిగిందని ఆయన వివరించారు. తెలంగాణలోని ప్రతి విద్యార్థి చదువుకొని ఉన్నత లక్ష్యాలు చేరుకునే దిశగా ప్రయత్నం చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి, విద్యాశాఖ మంత్రులతో విద్యా సంస్కరణలపైన చర్చలు జరిపి, విద్యార్థుల అవసరాలు గుర్తించి వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుందని, దేశాభివృద్ధికి పునాదులైన పాఠశాలల అభివృద్ధిపైన కార్యచరణ ప్రారంభించామని ఆయన తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో ఒక్క విద్యార్థి ఉన్న పాఠశాలలను మూసివేత ఉండదని, పాఠశాలల సంస్కరణ మాత్రమే పాఠశాలల అభివృద్ధి మాత్రమే ఉంటుందని ఆయన ఉద్ఘాటించారు.

- Advertisement -

గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను నీరుగార్చిందని, తమ ప్రభుత్వం విద్యకై ఉన్నత ఆలోచనలు చేస్తుందని ఆయన తెలిపారు. విద్యార్థులు శ్రద్ధగా చదువుకొని జీవితంలో ఉన్నత లక్ష్యాలు చేరుకోవాలని ఆయన సూచించారు. అనంతరం జిల్లా పాలనాధికారి శ్రీహర్షతో కలిసి మంత్రి శ్రీధర్ బాబు డిజిటల్ తరగతులు, సైన్స్ ల్యాబ్, ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రి రమా సురేష్ రెడ్డి, ఎంపీపీ కొండ శంకర్, అదనపు కలెక్టర్ అరుణశ్రీ, ఆర్డీవో హనుమా నాయక్, ఎమ్మార్వో రాజయ్య, పాఠశాల హెడ్మాస్టర్, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు విద్యార్థులు, వైస్ చైర్మన్ శ్రీపతి బానయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అయిలి ప్రసాద్, సీనియర్ నాయకులు ఇనుముల సతీష్, శశి భూషణ్ కాచే, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పోలు శివ, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి జనగామ నరసింగరావు, ప్రచార కమిటీ నాయకులు ఒడ్నాల శ్రీనివాస్, పాక్స్ చైర్మన్ కొత్త శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిలర్లు, జిల్లా ఉపాధ్యక్షులు నూకల బానయ్య, జిల్లా బీసీ సంఘం కార్యదర్శి గోటికారి కిషన్ జి, జిల్లా ప్రధాన కార్యదర్శి కుడుదుల వెంకన్న, సింగిల్ విండో డైరెక్టర్ రావికంటి సతీష్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అజీమ్ ఖాన్, ఎస్సీ సెల్ డివిజన్ అధ్యక్షులు మంథని సత్యం, ఐఎన్టీయుసి జాతీయ ప్రధాన కార్యదర్శి పెరవేణ లింగయ్య, నాయకులు ఆకుల కిరణ్, బీసీ సంఘం నాయకులు పూసల సమ్మయ్య, యువజన విభాగం మండల అధ్యక్షుడు ఎరుకల ప్రవీణ్, పట్టణ విభాగం అధ్యక్షుడు పెంటరి రాజేందర్, యువ నాయకులు మోహన్, బండారి ప్రసాద్, గుండా రాజు సోషల్ మీడియా ఇన్చార్జి కిరణ్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement