- ప్రతి గురుకులంలోనూ ఫుడ్ సేప్టే కమిటీలు నియామకం
- ఫుడ్ పాయిజన్ కారణాలు తేల్చేందుకు టాస్క్ పోర్స్
- ముగ్గురు ఉన్నాతాధికారుతో టాస్క్ ఫోర్స్
- ఆహార నాణ్యత పరిశీలించి నివేదక ఇవ్వనున్న టాస్క్ ఫోర్స్
హైదరాబాద్: ఇటీవల గురుకులాల్లో వరుసగా జరుగుతున్న ఫుడ్ పాయిజన్ కేసులకు సంబంధించి కారణాలు తేల్చేందుకు తెలంగాణ ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. ఫుడ్ సేఫ్టీ కమిషనర్, అదనపు డైరెక్టర్, జిల్లా స్థాయి అధికారితో కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే గురుకులాలు, హాస్టళ్లలో ఫుడ్ సేఫ్టీ కమిటీలను సైతం ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఈ కమిటీలలో హెడ్ మాస్టర్, హాస్టల్ వార్డెన్, మరో ఇద్దరు టీచర్స్ ను సభ్యులుగా చేర్చారు.. వండిన ఆహారాన్ని ఈ కమిటీ సభ్యులు పరిశీలించిన అనంతరమే విద్యార్ధులకు వడ్డించాలని ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం . ఇక అంగన్వాడీలు, ఆసుపత్రుల్లో ఆహార నాణ్యతను టాస్క్ ఫోర్స్ పర్యవేక్షించనుంది. ఫుడ్ పాయిజన్ జరిగినప్పుడు కారణాలు తేల్చి బాధ్యులను గుర్తించి ఈ టాస్క్ ఫోర్స్ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.
- Advertisement -