Thursday, November 21, 2024

తెరుచుకోనున్న విద్యాసంస్థలు.. హాజరవుతున్న అధ్యాపకులు

తెలంగాణలో కరోనా మహమ్మారి తగ్గడంతో విద్యాసంస్థలు ప్రారంభం కానున్నాయి. జులై 1 నుంచి పాఠశాలలు, కాలేజీలు ప్రారంభించాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించింది. విద్యా శాఖ ఆదేశాలతో ఇవాళ్టి నుంచి పాఠశాలల అధ్యాపకులు, కాలేజీ లెక్చరర్లతో పాటు నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా విద్యాసంస్థలకు హాజరు అవుతున్నారు. దాదాపు 3 నెలల తర్వాత టీచర్లు, లెక్చరర్లు విద్యాసంస్థలకు తిరిగి హాజరవుతున్నారు.

మరోవైపు విద్యాసంస్థలు తిరిగి తెరుచుకోనున్న నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ కీలక సూచనలు చేసింది. స్కూళ్లు, కాలేజీలను పరిశుభ్రంగా ఉండాలని తెలిపింది. సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలను పాటించాలని ఆదేశించింది. కాగా, కరోనా కారణంగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం పదో తరగతి, ఇంటర్ పరీక్షలను రద్దు చేసిన సంగతి తెలిసిందే.

ఇదీ చదవండి: ఎస్ఈసీగా నీలం సాహ్ని నియామకంపై పిటిషన్ ఉపసంహరణ!

Advertisement

తాజా వార్తలు

Advertisement