ధాన్యం విషయంలో రాష్ట్రప్రభుత్వం స్కాం చేస్తోందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… రేషన్ బియ్యం సక్రమంగా ఇవ్వడం లేదన్నారు. ప్రజల్ని వదిలేసి ఢిల్లీకి ఎందుకొచ్చారని బరాబర్ అడుగుతామన్నారు. రాష్ట్ర మంత్రులను ఢిల్లీకి పంపడం పెద్ద డ్రామా అన్నారు. రైతులపై కంటే రాజకీయాలపైనే టీఆర్ఎస్ కు శ్రద్ధ అన్నారు. బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని ఎందుకు లేఖ ఇచ్చారని ప్రశ్నించారు. దీదీని కేసీఆర్ ఫాలో అవుతున్నారన్నారు.
ఇదిలా ఉండగా… కాసేపటి క్రితమే రాష్ట్రమంత్రి హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. రైతులపై ఢిల్లీకి వెళ్లిన తమ మంత్రులను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అవమానించారని, అందుకు క్షమాపణ చెప్పాలని మాట్లాడిన విషయం విదితమే.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital