Friday, November 22, 2024

TS: ఉద్యోగాల్లో మ‌హిళ‌ల‌కు స‌మాంత‌ర రిజ‌ర్వేష‌న్లు.. అమ‌లుకు ప్ర‌భుత్వం నిర్ణ‌యం…

మహిళలకు తెలంగాణ ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో మహిళలకు 33 1/3 శాతం సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రత్యేక రోస్టర్ పాయింట్ కేటాయించకుండా ఓసీ, ఈడ‌బ్ల్యూఎస్‌, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్, క్రీడాకారుల విభాగాల్లో సమాంతర రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. వర్టికల్ రిజర్వేషన్లకు గతంలో ఇచ్చిన జీవో నం.41/1996, జీవో నం. 56/1996 ఉత్తర్వులను రద్దు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement