Saturday, November 16, 2024

Suspend – గోపాల‌పురం సిఐ, ఎస్ ఐ ల‌పై స‌స్పెన్ష‌న్ వేటు …

హైదరాబాద్ : గోపాలపురం సీఐ మురళీధర్ , ఎస్‌ఐ దీక్షిత్‌ రెడ్డిని హైదరాబాద్‌ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డి సస్పెండ్ చేశారు. రెండు నెలల క్రితం గోపాలపురంలో స్థిరాస్తి వ్యాపారి హత్య కేసులో సరిగా విచారణ జరుపలేదని ఇద్దరి సస్పెండ్‌ చేస్తూ నేడు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, సీపీగా బాధ్యతలు చేపట్టినప్పటించి శ్రీనివాస్‌రెడ్డి దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. విధుల్లో అలసత్వం వహించిన సిబ్బందిపై వేటు వేస్తూ పోలీస్‌ శాఖలో మార్పులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగానే పంజాగుట్టా సిబ్బంది మొత్తాన్ని ఏక‌కాలంలో బ‌దిలీ చేసేశారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement