Thursday, December 26, 2024

Good News – రేపు రేవంత్ తో టాలీవుడ్ ప్ర‌ముఖుల భేటి…

హైద‌రాబాద్ – సంధ్య థియేట‌ర్ తొక్కిసలాట ,సినీ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ ఘ‌ట‌న‌ల నేప‌థ్యంలో సినీ ప్ర‌ముఖులు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిని క‌లువనున్నారు.. రేపు ఉద‌యం 10 గంట‌ల‌కు సినీ ప్ర‌తినిధుల బృందం ముఖ్య‌మంత్రి తో బేటీ కానున్నారు. ఈ మేర‌కు ముఖ్య‌మంత్రి కార్యాల‌యం టాలీవుడ్ పెద్ద‌ల‌కు అపాయింట్మెంట్ ఇచ్చింది.. ఇదే విష‌యాన్ని తెలంగాణ ఫిల్మ్ ఫెడ‌రేష‌న్ ఛైర్మ‌న్,నిర్మాత దిల్ రాజు తెలిపారు..

కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగే ఈ భేటీలో .టాలీవుడ్‌ నుంచి చిరంజీవి, వెంకటేష్,అల్లు అరవింద్,దిల్ రాజు పలువురు నిర్మాతలు, దర్శకులు హాజరుకానున్నారు. ప్రభుత్వం నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్,దామోదర రాజనర్సింహ పాల్గొననున్నారు.

,

- Advertisement -

సంధ్య థియేటర్ ఘటనతో పాటు మ‌రికొన్ని ఇత‌ర అంశాల‌ను రేవంత్ దృష్టికి తీసుకెళ్ల‌నున్న‌ట్లు చెప్పారు.. సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా విడుద‌ల కానున్న భారీ బ‌డ్జెట్ చిత్రాల నేప‌థ్యంలో బెన్ ఫిట్ షోలు, టికెట్ల పెంపు అంశాల‌పై కూడా రేవంత్ తో సీని ప్ర‌ముఖులు చ‌ర్చించ‌నున్నారు…

Advertisement

తాజా వార్తలు

Advertisement