Friday, November 22, 2024

Good News: ఒకే కాన్పులో నలుగురు పిల్లలు.. ఎక్కడో తెలుసా!

గర్భిణులు ఒకసారి ఒక బిడ్డకే జన్మిస్తుంటారు. మరికొందరు కవలలను ప్రసవిస్తుంటారు. ఇంకొందరు అరుదుగా ముగ్గురు బిడ్డలకు జన్మనిస్తుంటారు. హైదరాబాద్‌కు చెందిన ఒక మహిళ ఒకే కాన్పులో నలుగురు బిడ్డలను జన్మనిచ్చింది.

హైదారాబాద్​ మెహదీపట్నంలోని ఓ ఆస్పత్రిలో ఈ అద్భత ఘటన జరిగింది. పాతబస్తీలోని హఫీజ్‌ బాబా నగర్‌కు చెందిన అఫ్రీన్‌కు ముగ్గురు ఆడ, ఒక మగ శిశువు జన్మించారని, తల్లీ బిడ్డలు అంతా క్షేమంగానే ఉన్నట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. మగ బిడ్డ 1500 గ్రాములు, ఆడ బిడ్డలు 1500, 1400, 1300 గ్రాములున్నట్లు వారు వివరించారు.

మూడు గంటల పాటు శ్రమించి..
అఫ్రీన్‌కు ఇది మూడో కాన్పు. పైగా ఆమెకు కొన్ని ఆరోగ్య సమస్యలున్నాయి. అయినా వైద్యుల బృందం విజయవంతంగా సిజేరియన్‌ చేసి ఆమెకు సుఖ ప్రసవమయ్యేలా చేసింది. ‘మా ఆస్పత్రిలో ఇప్పటివరకు సుమారు 10వేలకు పైగా ప్రసవాలు జరిగాయి. అయితే ఒకే కాన్పులో నలుగురు జన్మించడమనేది ఇదే మొదటిసారి. అఫ్రీన్‌కు పలు ఆరోగ్య సమస్యలున్నాయి. సిజేరియన్‌ సమయంలో ఆమె రక్తపోటు 170/110 గా ఉంది. అదేవిధంగా రక్తస్రావం కూడా ఎక్కువగా జరిగింది. దీంతో డెలివరీ జరుగుతుండగానే ఆమెకు రక్తం ఎక్కించాల్సి వచ్చింది. మొత్తానికి మూడు గంటల పాటు శ్రమించి అఫ్రీన్‌కు సుఖ ప్రసవం జరిగేలా చేశాం. పుట్టిన తర్వాత ఇద్దరు పిల్లలు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటే ఆక్సిజన్‌ సపోర్ట్‌ అందించాం’ అని హాస్పిటల్​ డాక్టర్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement