సింగరేణి కార్మికులు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సంస్థ సాధించిన లాభాల్లో 32శాతం వాటా చెల్లించనున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు ఇవ్వాల (మంగళవారం) రాత్రి ఆదేశాలు జారీ చేశారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి రూ.2,222 కోట్ల రికార్డు స్థాయి లాభాలను ఆర్జించింది. ఇందులో రూ.700కోట్లకుపైగా లాభాలను కార్మికులకు దసరా ముందస్తుగా చెల్లించనున్నట్లు సీఎం కేసీఆర్ రెండు నెలల కిందట మంచిర్యాలలో ప్రకటించారు.
ఈ క్రమంలో ఇచ్చిన మాటమేరకు గతంలో గతంలో 30శాతానికి మించి కార్మికులకు రూ.700కోట్లకుపైగా లాభాల్లో వాటా వచ్చేలా 32శాతం వాటా రూ.711 కోట్లను ప్రకటించారు. ఇటీవలనే కార్మికులకు 11వ వేతన ఒప్పందానికి సంబంధించి 23 నెలల బకాయిలు దాదాపు రూ.1,450 కోట్లను ప్రభుత్వం చెల్లించింది. అక్టోబర్ 23న దసరా ఉండడంతో ముందుగానే లాభాల్లో వాటాను చెల్లించేలా సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా కార్మికులకు వాటా వస్తుండడంతోపై కార్మిక లోకం హర్షం వ్యక్తం చేస్తున్నది.