హైదరాబాద్ – సింగరేణి కార్మికులకు, ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏక మొత్తంలో ఒకేసారి ఏరియర్స్ సింగరేణిలో ఉద్యోగులకు, కార్మికులకు చెల్లించేలా సింగరేణి సర్క్యులర్ విడుదల చేసింది.
ఈనెల 21న ఉద్యోగులందరికీ చెల్లింపు చేయనున్నట్లు సర్క్యులర్ లో సింగరేణి యాజమాన్యం పేర్కొంది. దీంతో ఒక్కో కార్మికుడికి దాదాపుగా 4 లక్షల మేర ఏరియర్స్ అందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 40 వేల ఉద్యోగులకు లబ్ది చేకూరనుంది.
సీఎం కేసీఆర్, టీజీబీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు కవిత ప్రత్యేకత చొరవతో నాయకుల కృషితో ఒకేసారి కార్మికులకు ఎరియర్స్ బకాయిలు అందనున్నాయి. 23 నెలల ఏరియర్స్ చెల్లింపు లో 23 నెలల సీఎంపీఎఫ్ షేర్, ఇన్ కామ్ టాక్స్ వాటి బకాయిలు తీసుకొని మిగతా బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోనున్నారు. అయితే ఒకేసారి ఏరియర్స్ విడుదల చేయడంపై ఉద్యోగులు, కార్మిక నాయకుల హర్షం వ్యక్తం చేస్తున్నారు