హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : గత నెలలో సీఎం కేసీఆర్ ప్రకటించిందే తడువుగా తెలంగాణ అర్చకులకు పెంచిన రూ.10వేల గౌరవ వేతనం అమలుకు అధికార యంత్రాంగం చర్యలు ప్రారంభించింది. ఈ నెల నుంచే వారందరికీ రూ.10 వేలు అందించనుంది ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలోని మరో 350 ఆలయాలకు ధూప దీప నైవేద్య పథకాన్ని (డిడిఎన్) వర్తింపజేస్తూ తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
దీంతో రాష్ట్రంలో ఈ పథకం అమలవుతున్న ఆలయాల సంఖ్య 6,271కి పెరిగింది. అలాగే ఈ ఆలయాల్లో పనిచేసే అర్చకులకు రూ.10వేల గౌరవ వేతనాన్ని ఈ నెల నుంచే అమలు చేయనున్నట్లు- అధికారులు తెలిపారు. డిడిఎన్ అర్చకుల గౌరవ వేతనాన్ని రూ.6వేల నుంచి రూ.10వేలకు పెంచుతున్నట్టు- సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.