Thursday, January 30, 2025

TG | రైత‌న్న‌ల‌కు గుడ్ న్యూస్ – స‌బ్సిడీ ధ‌ర‌ల‌కు డ్రోన్లు, ట్రాక్ట‌ర్లు..

హైద‌రాబాద్ – తెలంగాణలో వ్యవసాయం రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది. గతంలో ఎద్దులు, దున్నల సహాయంతో రైతులు భూమిని చదునుచేసేవారు. కానీ ఇప్పుడు వాటి స్థానంలో ట్రాక్టర్లు వచ్చి, వ్యవసాయానికి ఆధునిక సాంకేతికతను జోడిస్తున్నారు. ముఖ్యంగా, డ్రోన్ల సాయంతో రసాయనాలు స్ప్రే చేయడం ప్రస్తుతం సాధ్యమైంది. వ్యవసాయ యాంత్రీకరణకు తెలంగాణ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. రైతులకు అవసరమైన 20రకాల సాగు సామాగ్రిని అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ పరికరాలకు కొంత మొత్తం సబ్సిడీ కూడా ఇవ్వనుంది. ఇందులో ట్రాక్టర్లు, కల్టివేటర్లు, పురుగు మందులు పిచికారీకి డ్రోన్లు, పవర్ స్ప్రేయర్లు వంటి పరికరాలు ఉంటాయి.

ఈ పరికరాలను సరఫరా చేసే కంపెనీలతో ఒప్పందం చేసేందుకు వ్యవసాయ శాఖ టెండర్లు ఆహ్వానించింది. టెండర్ల దాఖలుకు గడువు ఫిబ్రవరి 7, 2025గా నిర్ణయించారు. 8వ తేదీన బిడ్‌లను తెరిచి, తక్కువ కోట్ చేసిన వాటిని ఎంపిక చేయనున్నారు. సబ్సిడీ కింద రైతులకు అందజేయనున్న యంత్ర పరికరాల కోసం రూ.50నుండి రూ.60 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేయబడింది. గత ప్రభుత్వ హయాంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని ప్రారంభించారు, కానీ అది ఆశించిన స్థాయిలో అమలుకు రాలేదు. ఈ నేపథ్యంలో, ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం పథకాన్ని పూర్తిగా అమలు చేయాలని నిర్ణయించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement