Monday, November 18, 2024

ఎయిర్‌ పోర్ట్ ప్రయాణికులకు శుభవార్త.. బస్సు ఎక్కడుందో తెలుసుకోండి..

ప్రభన్యూస్ : టీఎస్‌ఆర్టీసీ, ఎయిర్‌ పోర్ట్‌ వెళ్లే బస్సులకు సంబంధించిన ఆన్‌లైన్‌ బస్సు ట్రాకింగ్‌ సదుపాయం అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణికులు తమ స్మార్ట్‌ ఫోన్‌లోని ప్లేస్టోర్ ద్వారా టీఎస్‌ఆర్టీసీబస్సుటిక్కింగ్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఈ యాప్‌ ద్వారా ఎయిర్‌పోర్టు బస్సుల సమయ సూచిక, ఎంచుకున్న రూట్‌లో ఏ బస్సు ఎక్కడి వరకు వచ్చిందో, తాము ఉన్న ప్రాంతానికి ఎంత దూరంలో ఉందో, ఎంత వ్యవధిలో వస్తుందో, గమ్యస్థానం ఎప్పుడు చేరుకునునో సులువుగా తెలుసుకోవచ్చు. ఇది ఎయిర్‌పోర్ట్‌ ప్రయాణికులకు ఎంతో ఉపయుక్తంగా ఉంది. బస్సు ఎప్పుడు వస్తుందో? అనే చింత ఉండదు, భద్రతతో పాటు తమ విలువైన సమయంను సరిగా సద్వినియోగం చేస్కోవచ్చు.

గ్రేటర్‌ హైదరాబాద్‌లో సుమారు 45 పుష్పక్‌ బస్టాప్‌ల నుండి ఎయిర్‌పోర్ట్‌కు సులభంగా చేర్కొనడానికి ఈ యాప్‌ ఉపయోగప‌డుతుంది. ప్రయాణికులకు నాణ్యమైన సర్వీస్‌ అందించడంలో, సమస్యలకు తక్షణ పరిష్కారం చేయడంలో ఎప్పుడూ ముందుంటామని సికింద్రాబాద్‌ రీజినల్‌ మేనేజర్ జి.యుగంధర్‌ తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement