Friday, November 22, 2024

Good news – స్కై వాక్ నిర్మాణానికి భూమి ఇచ్చేందుకు కేంద్రం అంగీకారం

కేంద్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పింది. మెహదీపట్నంలో స్కై వాక్ నిర్మాణానికి గాను భూకేటాయింపునకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మెహదీపట్నంలో రక్షణ శాఖకు చెందిన 3,380 చదరపు గజాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర అప్పగించనుంది. అయితే.. ఇక్కడే కేంద్రం ఒక కండీషన్ పెట్టింది. ఆ భూములు ఇచ్చినందుకు గాను రక్షణ శాఖకు రూ.15.15 కోట్ల మౌలిక వసతులు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి షరతు విధించింది. అలాగే.. కొంత స్థలానికి పదేళ్లు లైసైన్స్ రుసుం చెల్లించాలని పేర్కొంది. నాలుగు వారాల్లోనే ఈ భూముల్ని అప్పగించేలా కేంద్ర రక్షణ శాఖ అంగీకారం తెలిపింది..

ఇదిలావుండగా.. మెహదీపట్నంలో రోడ్డు దాటేందుకు పాదచారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతుండటంతో, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ ప్రాంతంలో స్కైవాక్ నిర్మించాలని నిర్ణయించింది. ఐదేళ్ల క్రితం హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో ఈ స్కైవాక్‌ని ప్రతిపాదించగా.. మూడేళ్ల క్రితం రూ.34.28 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు పనులను ప్రారంభించారు. అయితే.. తమ భూముల్లో పనులు చేస్తున్నారని రక్షణ శాఖ అడ్డుకోవడంతో, ఈ స్కైవాక్ పనులు ఆగిపోయాయి. ఈ పనుల్ని పునఃప్రారంభించేందుకు గత ప్రభుత్వం ప్రయత్నించింది కానీ, ఎందుకో ముందుకు సాగలేదు. ఇప్పుడు రక్షణ శాఖ భూములు ఇచ్చేందుకు అంగీకారం తెలపడంతో, ఈ పనులు తిరిగి ప్రారంభం కానున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement