Monday, July 1, 2024

TS: బిల్ట్ ఫ్యాక్టరీని మళ్లీ తెరిపిస్తాం – మంత్రి సీతక్క

మంగపేట, జూన్ 28 (ప్రభ న్యూస్) : ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురంలో గత పదేండ్ల క్రితం మూతపడిన బిల్ట్ కంపెనీకి త్వరలోనే మంచి రోజులు రానున్నాయని రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధ‌నసరి అనసూయ (సీతక్క) అన్నారు. మూత పడిన బిల్ట్ ఫ్యాక్టరీని మంత్రి సీతక్క ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్, ఏటూరునాగారం ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ చిత్రా మిశ్రా, జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీజ తదితరులతో కలిసి శుక్రవారం పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం కార్మిక పక్షపాతి అని అన్నారు. బిల్ట్ ఫ్యాక్టరీలోని పాత యంత్రాలు, పాత సామాను తొలగింపు, సంబంధిత విషయాలను ఫిన్ క్వెస్ట్ సంస్థ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. పాత మిషనరీ తొలగింపు విషయంలో జాప్యం చేయకుండా చూడాలని ఫిన్ క్వెస్ట్ సంస్థ, రాధా స్టీల్ సంస్థ ప్రతినిధులకు సూచించారు. వీలున్నంత‌ త్వరలో బిల్ట్ ఫ్యాక్టరీని రీ ఓపెనింగ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్, కాంగ్రేస్ పార్టీ మండల అధ్యక్షుడు మైల జయరాం రెడ్డి, కాంగ్రేస్ పార్టీ జిల్లా, నియోజకవర్గ, బ్లాక్, మండల, గ్రామ స్థాయి నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement