వనపర్తి ప్రతినిధి, నవంబర్ 21(ఆంధ్ర ప్రభ) : కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మత్స్యకారులందరికీ మంచి రోజులు వచ్చాయని.. మత్స్యకారుల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్పొరేషన్ ను ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా మత్స్యకార సోదరులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మత్స్యకార కుటుంబాలను BC-D గ్రూప్ నుంచి A గ్రూప్ లోనికి మార్చడం, చేపల వేట చేసుకునే మత్స్యకారులందరికీ చెరువులపై పూర్తి హక్కులు కల్పించడం, ఉచిత చేపపిల్లలను పంపిణీ చేయడం లాంటి అనేక కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిందన్నారు. మత్స్యకారులందరికీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంచి రోజులు రానున్నట్లు పేర్కొన్నారు. మత్స్య సహకార సంఘాల సభ్యులకు, మత్స్యకారులకు, మహిళలకు, మత్స్యకార యువకులకు, ఎమ్మెల్యే ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.