అయోధ్య శ్రీరామచంద్రుడి పాదాల చెంత సిరిసిల్ల నుండి బంగారు చీరను ఉంచనున్నారు. సిరిసిల్ల నేతన్న హరిప్రసాద్ తన చేతులతో స్వయంగా తయారు చేసిన బంగారు చీరెను ఈనెల 26న ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అందించనున్నారు. ప్రధాని చేతుల మీదుగా రాముడి పాదాల చెంత చీరెను ఉంచనున్నారు
ఈ క్రమంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈరోజు సాయంత్రం సిరిసిల్లలోని హరిప్రసాద్ నివాసానికి వెళ్లారు. హరి ప్రసాద్ స్వయాన తయారు చేసిన బంగారు చీరెను పరిశీలించారు. శ్రీరాముడి చిత్రంతోపాటు రామాయణ ఇతివ్రుత్తాన్ని తెలియజేసే చిత్రాలను సైతం ఆ చీరెలో పొందుపర్చడం విశేషం. 8 గ్రాాముల బంగారం, 20 గ్రాముల వెండితో తయారు చేసిన చీర అందరినీ అబ్బురపరిచేలా ఉంది. అద్బుతంగా చీరెను తయారు చేసిన హరిప్రసాద్ ను ఈ సందర్భంగా బండి సంజయ్ అభినందించారు. శాలువాతో సత్కరించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ….ఈనెల 22న అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా సిరిసిల్ల నేతన్న హరిప్రసాద్ స్వయాన తన చేతులతో తయారు చేసిన బంగారు చీరె చాలా బాగుందన్నారు. ఈనెల 26న ప్రధానికి చీరెను అందించనున్నారని, ప్రధాని చేతుల మీదుగా శ్రీరాముడి పాదాల చెంతను ఉంచేందుకు సిద్ధమవడం సంతోషంగా ఉందన్నారు. గతంలో అగ్గిపెట్టెలా చీరెను ఉంచిన చరిత్ర సిరిసిల్ల జిల్లాదన్నారు. ఇంతిటి గొప్ప నైపుణ్యాన్ని సొంతం చేసుకున్న చేనేత రంగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చేనేత కార్మికులను ఆదుకునేందుకు తనవంతు క్రుషి చేస్తానని హమీ ఇచ్చారు..